Megastar Chiranjeevi Signature Steps: టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే స్టెప్స్ వేసింది ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. 1997లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'హిట్లర్' లో 'నడక కలిసిన నవరాత్రి' పాటలో హబీబీ స్టెప్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఆ సాంగ్ లో 'హబీబీ హబీబీ' అనే హమ్మింగ్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ మూవీకి సంగీతం అందించిన కోటి ఈ అబీబీని 'దీదీ' అనే అరబ్ పాట నుంచి తీసుకున్నారు. ఈ పాటను ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర కలిసి పాడారు.
1991లో రిలీజైన ఈ దీదీ సాంగ్‌ను అల్జేరియన్ సింగర్ ఖాలేద్ తనే సొంతంగా రాసి పాడారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఇది ఎంత సూపర్ హిట్ అయిందంటే దాదాపు 26 వారాల పాటు టాప్- 50 లో ఉంది. స్విట్జర్లాండ్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, బెల్జియం దేశాల్లో కూడా ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో ఖాలేద్ ఈ పాటను పాడారు.
ఇక సుప్రీం హీరో చిరంజీవిని మెగాస్టార్‌గా చేసిన 'హిట్లర్' సినిమా మలయాళ చిత్రానికి రీమేక్. ఐదుగురు చెల్లెల్లకు అన్నయ్యగా ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్, డ్రామా అంశాలు ఈ మూవీని సూపర్ హిట్ చేశాయి. ఈ సినిమాను ముత్యాల సుబయ్య తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి సరసన రంభ హీరోయిన్గా నటించారు. 'నడక కలిసిన నవరాత్రి' పాటలో చిరంజీవి వేసిన అబీబీ స్టెప్ ఒక ఐకానిక్ స్టెప్‌గా మారి డ్యాన్స్‌లో మెగాస్టార్‌కు ఎవరు సాటి లేరని నిరూపించింది. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేశారు. ఈ ట్రెండ్ సెట్టింగ్ డ్యాన్స్ స్టెప్ తర్వాత 2002లో వచ్చిన 'ఇంద్ర' సినిమాలోని 'వీణ' స్టెప్ కూడా టాలీవుడ్ ఐకానిక్ స్టెప్‌గా మారింది. ఇప్పటికి ట్రెండింగ్‌లో ఉన్న ఈ స్టెప్‌కు కూడా రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు.
విశ్వంభర కోసం మరో సీనియర్ బ్యూటీ! - Chiranjeevi Vishwambhara
'ఉపానస, క్లీంకారలో కామన్ పాయింట్ ఏంటి ?' - చిరు ఆన్సర్ ఇదే - Padma Vibhushan Chiranjeevi