ETV Bharat / entertainment

ANR అవార్డు అందుకున్న చిరంజీవి- ప్రదానం చేసిన బిగ్ బి - ANR 100 YEARS CELEBRATIONS

ANR జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి- ప్రదానం చేసిన అమితాబ్ బచ్చన్

Chiranjeevi ANR National Award
Chiranjeevi ANR National Award (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2024, 7:49 PM IST

Chiranjeevi ANR National Award 2024 : అక్కినేని నాగేశ్వరరావు (ANR Awards) జాతీయ అవార్డు వేడుకలు హైదరాబాద్​లో ఘనంగా జరిగాయి. అన్నపూర్ణ స్టూడియోస్​లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ఏఎన్నాఆర్​ జాతీయ అవార్డును అందుకున్నారు. కాగా, 2024 సంవత్సరానికి గాను ఏఎన్నార్​ జాతీయ పురస్కారాన్ని అక్కినేని ఫౌండేషన్ చిరంజీవికి ప్రదానం చేసింది.

ఇప్పుడు ఇంట గెలిచాను
పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఎన్ని అందుకున్నా అక్కినేని జాతీయ పురస్కారం అందుకోవడంతోనే తాను ఇంట గెలిచానని మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. తన నట జీవితానికి సంపూర్ణత చేకూరిందని ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ సినీ రంగంలో బాద్​షా లాంటి అమితాబ్చన్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు చిరంజీవి. తనకు గురువు, మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత అమితాబచ్చన్​కు ధన్యవాదాలు తెలిపారు. అక్కినేని కుటుంబం తనపై చూపించే ప్రేమ, అప్యాయతలకు ఎప్పటికి దాసుడనేనన్న మెగాస్టార్, భగవంతుడు తనకు ఇచ్చిన అద్భుతమైన స్నేహిడుతు నాగార్జున అని అభివర్ణించారు. ఈ సందర్భంగా తన తల్లి అంజనాదేవి అక్కినేని సీనియర్ అభిమానుల్లో ఒకరని గుర్తుచేసుకున్నారు.

నేనూ టాలీవుడ్ వ్యక్తినే
'చిరంజీవి, నాగార్జున, నాగ్‌ అశ్విన్‌ తదితరులు తమ సినిమాల్లో నన్ను భాగం చేశారు. తెలుగు చలన చిత్ర రంగంలో నేనూ సభ్యుడినే అని గర్వంగా చెప్పుకోగలను. ఇప్పటి నుంచి నన్నూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భాగంగా పరిగణించండి. వచ్చే సినిమాలోనూ నాకు అవకాశం ఇవ్వడాన్ని మర్చిపోవద్దు . అవార్డు అందజేత విషయంలో నాకు ఈ గౌరవం కల్పించిన అక్కినేని నాగేశ్వరరావు ఫౌండేషన్‌, నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు' అని అమితాబ్ బచ్చన్ అన్నారు.

కాగా, ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో సహా, చిరంజీవి తల్లి అంజనాదేవి, విక్టరీ వెంకటేశ్, రామ్​చరణ్, నాని, సుబ్బిరామి రెడ్డి, నిర్మాత అశ్వినీదత్, బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.

LIVE : ఏయన్నార్‌ జాతీయ పురస్కార వేడుకలు - చిరంజీవికి అక్కినేని అవార్డు

చిరంజీవికి ANR అవార్డు- 'ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా'! - ANR 100th Birthday Celebrations

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.