Mega Power Star Ramcharan Bad Habit : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక రంగస్థలం చిత్రంతో అయితే తనలోని మరో నటుడిని బయటకు తీసి గ్రేట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ బ్లాక్ బాస్టర్ హిట్‌తో గ్లోబల్ ఇమేజ్ ట్యాగ్ లైన్‌ను సంపాదించుకున్నారు. మెగా ఫ్యామిలీ ఇమేజ్ను వరల్డ్ వైడ్‌గా పరిచయం చేశారు. అంతకుముందు టాలీవుడ్‌కే పరిమితమైన తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెంచుకున్నారు. జేమ్స్ కామెరూన్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడి చేత శభాష్ అనిపించుకున్నారు.
చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్‌తో కలిసి భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చరణ్ సినిమాల విషయం పక్కనపెట్టి ఆయన పర్సనల్ విషయానికొస్తే రంగ స్థలం సినిమా నుంచే ఆయన ఎంతో మెచ్యూరిటీ చూపిస్తున్నారు. మాట్లాడే విధానం, ఉండే విధాంలో చాలా మార్పులు వచ్చాయి. ఇక ఆర్ఆర్ఆర్తో వచ్చిన ఇమేజ్ తర్వాత ఆయనలో మరింత ఛేంజ్ వచ్చేసింది.
ఎక్కడికి వెళ్లినా తన తండ్రిలాగే ఒదిగి మరి ఉంటూ, ప్రతిఒక్కరినీ ఎంతో గౌరవిస్తూ కనిపిస్తున్నారు. ఫ్యాన్స్‌తో మరింత బాగా కలిసి ఉండటం, ప్రేమగా మాట్లాడటం చేస్తున్నారు. ఈ చర్యలతో ఆయన కేవలం మెగా ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు ప్రతిఒకరిక్కీ ఫేవరెట్ హీరోగా మారిపోతున్నారు.
అయితే ఇంత మార్పు వచ్చిన చరణ్‌లో ఒక్క బ్యాడ్ హ్యాబిట్ మాత్రం అలానే ఉండిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి! అదే మొహమాటం! చరణ్‌లో అది ఎక్కువగా ఉండిపోవడం వల్ల తనను ఇబ్బందికర పరిస్థితిలో పడేసిన వారిని కూడా ఏం అనలేకపోతున్నారట. ఏదైనా విషయం చెప్పితే వారు ఎక్కడు నొచ్చుకుంటారో అని వెనకడుగు వేస్తారట. కచ్చితంగా చెప్పాల్సిన సందర్భాల్లోనూ మొహమాటపడుతూనే ఉంటారట. అది ఆయన మంచితనమే అయినప్పటికీ కొన్నిసార్లు అది ఆయనకే నెగటివ్‌గా మారుతోందని అంటున్నారు. దీంతో మంచితనం ప్రతిసారి మనకు మంచి చేయదు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారని బయట కథనాలు కనిపిస్తున్నాయి. అంతే కాదు చరణ్‌లో సిగ్గు, బిడియం కాస్త ఎక్కువే అని కూడా అంటున్నారు.
అలా చేయమని బలవంతం చేశారు - సూసైడ్‌కు ప్రయత్నించా : 'బ్రహ్మముడి' అప్పు
ప్రియుడికి జబర్దస్త్ బ్యూటీ బ్రేకప్ - దానికి ఒప్పుకోకపోవడం వల్లే!