ETV Bharat / entertainment

చేసిన ఐదు సినిమాలు ప్లాప్ - కానీ నయన్​, తమన్నా కన్నా ఈమెకే క్రేజ్​ ఎక్కువ! - Most popular Heroine - MOST POPULAR HEROINE

ఈ ముద్దుగుమ్మ చేసింది ఆరు సినిమాలే. కానీ అందులో ఐదు ఫ్లాప్​. ఒకే ఒక్క హిట్​. అది కూడా సోలో హిట్ కాదు. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్లు అయినా నయనతార, తమన్నా కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే?

Source Getty Images
MOST POPULAR HEROINE (Source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 2:07 PM IST

దశాబ్దకాలంగా(2014 నుంచి 2024) ఎక్కువ ప్రజాదరణ పొందిన సినీ తారల జాబితాను ఐఎండీబీ రీసెంట్​గానే రిలీజ్ చేసింది. అయితే ఈ జాబితాలో ఆరు సినిమాలు చేసి ఒకే ఒక్క హిట్(సోలో హిట్ కాదు) అందుకున్న హీరోయిన్​ కూడా నిలవడం విశేషం. స్టార్ హీరోయిన్లు తమన్నా, నయనతారల కన్నా ఎక్కువ పాపులారిటీ ఉన్న నటిగా చోటు దక్కించుకుంది. టాప్ 100లో 15వ పొజిషన్ దక్కించుకుంది. ఆమెనే త్రిప్తి దిమ్రీ.

30 ఏళ్ల ఈ బ్యూటీ 15వ స్థానంలో నిలవగా దీపికా పదుకొణె, షారూక్ ఖాన్‌, ఐశ్వర్యారాయ్‌లు టాప్ 1, 2, 3 పొజిషన్లలో చోటు దక్కించుకున్నారు. వాస్తవానికి త్రిప్తి దిమ్రి 2017లోనే పాస్టర్ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లైలా మజ్ను, బుల్బుల్, ఖాలా లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ చిత్రాలు ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు.

కానీ యానిమల్ మాత్రం ఈ ముద్దుగుమ్మ లైఫ్​ను ఛేంజ్ చేసేసింది. ఈ సినిమాలో ఆమె నటించింది సెకండ్ హీరోయిన్​గా మాత్రమే. కానీ ఆమె అందానికి, పెర్ఫామెన్స్​కు యువత ఫిదా అయిపోయారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు సినీ ఛాన్స్​లు కూడా ఎక్కువయ్యాయి. ఈ పాపులారిటీతోనే తమన్నా, రణబీర్ కపూర్, నయనతార, రణవీర్ సింగ్, అజయ్ దేవగన్ లాంటి స్టార్లను వెనక్కు నెట్టి మరీ ఐఎండీబీ తాజా జాబితాలో దూసుకెళ్లింది.

త్రిప్తి తర్వాతి ప్రాజెక్టులు - యానిమల్ సినిమాతో హాట్ అండ్ గ్లామరస్ పేరు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రి వరుసగా నాలుగు ప్రాజెక్టులకు సంతకం చేసింది. ఇవి దాదాపు రెడీ అయి రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్ర పోషిస్తున్న విక్కీ విద్య కా వో వాలా సినిమాలో నటించనుంది. విక్కీ కౌశల్, అమ్మీ విర్క్​తో కలిసి బ్యాడ్ న్యూస్లో కనిపించనుంది. ఆ తర్వాత భూల్ భులయ్యా 3లో కార్తీక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్​తో కలిసి నటించనుంది. ఒక వారం ముందే సిద్దాంత్ చతుర్వేదీతో కలిసి ధడక్ 2లో నటిస్తున్నట్లు సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది.

'కల్కి'లో విలన్ రోల్‌ పోషించేది ఆ బెంగాలీ నటుడేనా? - Kalki 2898 AD

గ్యాంగ్స్​ ఆఫ్ గోదావరి - తొలిరోజు ఎన్ని కోట్లంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.