ETV Bharat / entertainment

ఈ రిచెస్ట్ యాక్టర్​ ఆస్తి రూ.11,000 కోట్లు - షారుక్​, టామ్ క్రూయిస్ మాత్రం కాదు! - Richest Actor In World - RICHEST ACTOR IN WORLD

Richest Actor Net worth of 11,000 crores: ప్రపంచంలో సినిమా స్టార్లు సంపాదించే క్రేజ్‌, సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి భారత్​తో పాటు ప్రపంచంలోనే అత్యంత విలువైన రిచెస్ట్ యాక్టర్​ ఎవరో తెలుసా?

source Associated Press
Richest Actor Net worth of 11,000 crores (source Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 9:16 PM IST

Richest Actor Net worth of 11,000 crores : ఈ రోజుల్లో మూవీలు సాధిస్తున్న కలెక్షన్లు భారీగా ఉంటున్నాయి. స్టార్‌ హీరోల సినిమాలు వందల కోట్ల మార్కెట్‌ను సులువుగా క్రాస్‌ చేస్తున్నాయి. హీరోలు, డైరెక్టర్ల రెమ్యునరేషన్‌ కూడా అదే స్థాయిలో ఉంటోంది. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటుల్లో ఎవరు రిచెస్ట్ యాక్టర్​? అనేది మీకు తెలుసా?

  • మొదటి స్థానంలో టైలర్ పెర్రీ
    2024 నాటికి టైలర్ పెర్రీ ప్రపంచంలోనే రిచెస్ట్ యాక్టర్‌గా నిలిచారు. ఫోర్బ్స్ ప్రకారం, ఆయన నెట్‌ వర్త్‌ 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 11,721 కోట్లు). పాపులర్‌ మాడియా(Madea) ఫ్రాంఛైజీలో మాబెల్ ‘మాడియా’ ఎర్లీన్ సిమన్స్ పాత్రతో పెర్రీ క్రేజ్ సంపాదించుకున్నారు. పెర్రీ నటనతో పాటు, దర్శకుడు, రచయిత, నిర్మాతగా కూడా రాణించారు.
  • బిలియన్-డాలర్ సామ్రాజ్యాన్ని నిర్మించిన పెర్రీ
    టైలర్ పెర్రీ ఎక్కువగా 1990లలో టీవీ షోలు, సినిమాల ద్వారా సంపాదించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయన 320 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,679 కోట్లు) సంపాదించారు. అదనంగా, పెర్రీ దగ్గర $300 మిలియన్లు (సుమారు రూ.2,511 కోట్లు) క్యాష్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ రూపంలో ఉంది. అలానే $40 మిలియన్ల (సుమారు రూ.334 కోట్లు) విలువైన రియల్ ఎస్టేట్, విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి.

    2015లో, పెర్రీ జార్జియాలోని అట్లాంటాలో 330 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దానిని టైలర్ పెర్రీ స్టూడియోస్‌గా మార్చారు. 2019లో ప్రారంభమైన ఈ స్టూడియో ద్వారా సంవత్సరానికి $280 మిలియన్లు (సుమారు రూ.2,344 కోట్లు) ఆదాయం వస్తుంది. అంతేకాకుండా, స్ట్రీమింగ్ సర్వీస్ అయిన BET+లో పెర్రీకి 25% వాటా ఉంది. ఇది ఆయన నెట్‌ వర్త్‌కు మరో $60 మిలియన్లు (సుమారు రూ. 502 కోట్లు) జోడించింది.
  • ఇతర రిచెస్ట్‌ యాక్టర్లు వీళ్లే
    జెర్రీ సీన్‌ఫెల్డ్: ఇతని నెట్‌ వర్త్‌ $1.1 బిలియన్ల (సుమారు రూ. 9,209 కోట్లు). పెర్రీ కన్నా కేవలం $300 మిలియన్లు తక్కువగా ఉంది.

    షారుఖ్​ ఖాన్: భారతదేశంలో అత్యంత సంపన్న నటుడు షారుక్​ ఖాన్‌. ఈయన నెట్‌ వర్త్‌ $760 మిలియన్లు (సుమారు రూ. 6,300 కోట్లు).

    టామ్ క్రూజ్ : రియల్ యాక్షన్ హీరో టామ్‌ క్రూజ్‌ తన పాత్రలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల 2024 పారిస్ ఒలింపిక్స్‌కు కూడా హాజరయ్యాడు. క్రూజ్ నెట్‌ వర్త్‌ $600 మిలియన్లు (సుమారు రూ. 5,023 కోట్లు).

    రాబర్ట్ డౌనీ జూనియర్ : ఐరన్ మ్యాన్ ఫేమ్ డౌనీ జూనియర్ నెట్‌ వర్త్‌ $300 మిలియన్లు (సుమారు రూ. 2,511 కోట్లు). ఈయన ‘ఎవెంజర్స్: డూమ్స్‌డే’లో డాక్టర్ డూమ్‌గా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌కు తిరిగి రానున్నాడు. దీంతో ఆయన ఆదాయం మరింత పెరగనుంది.

కియారా అడ్వాణీ సిస్టర్​ను మీరెప్పుడైనా చూశారా? - సో క్యూట్​! - Kiara Advani Sister

తనకన్నా 9 ఏళ్లు చిన్నవాడితో కృతిసనన్​ డేటింగ్​ - వామ్మో అతడి ఆస్తి రూ.4600 కోట్లా? - Kriti Sanon Boyfriend

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.