Musical School Director Debut Movie : ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన సర్వీస్‌గా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌ను (ఐఏఎస్) పేర్కొంటారు. ఈ సర్వీసులో అడుగుపెట్టడం అంత ఈజీ కాదు. లక్షల మంది అప్లై చేసుకుంటే కొన్ని వందల మంది మాత్రమే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దాటి కొలువు సంపాదిస్తారు. ఇంత కష్టపడి ఐఏఎస్ అయినవారు, దాన్ని వదులుకునే అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఐఏఎస్ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన వారిని చూసుంటారు. మరి సినిమాల కోసం అత్యున్నత సర్వీసును వదులుకున్న వ్యక్తి మీకు తెలుసా? ఆయనే పాపారావు బియ్యాల. మరీ ఆయన తీసిన మొదటి సినిమా ఏది? దాని ఫలితం ఎలా వచ్చిందంటే?
ఎవరీ పాపారావు బియ్యాల?
1982 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పాపారావు బియ్యాల. ఈయన భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. పీహెచ్డీ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నా, ఐఏఎస్‌కి సెలక్ట్ కావడం వల్ల ఆ ఆలోచన వదులుకున్నారు. తన పదవీ కాలంలో, బియ్యాల అస్సాంలో 1994-97 వరకు హోం సెక్రటరీగా పనిచేశారు. 1999లో కొసావోలోని ఐక్యరాజ్యసమితి మిషన్‌లో పౌర వ్యవహారాల అధికారిగా పనిచేశారు. 2014- 19లో తెలంగాణ ప్రభుత్వానికి విధాన సలహాదారుగా కూడా కీలక బాధ్యతలు చేపట్టారు.
అస్సాంలో ఉన్న సమయంలో పాపారావుకు ఫిల్మ్ మేకింగ్‌పై ఆసక్తి మొదలైంది. అప్పుడే లెజెండరీ ఫిల్మ్ మేకర్ జాహ్ను బారువాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో కొన్నేళ్ల పాటు బియ్యాల, ఆయన దగ్గర ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నారు. అంతే కాకుండా 1996లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి ఫిల్మ్ మేకింగ్‌లో డిప్లొమానూ సాధించారు. ఆ తర్వాత 'విల్లింగ్ టు శాక్రిఫైజ్' అనే ఓ డాక్యుమెంటరీని తీశారు. ఇది ఉత్తమ నాన్-ఫీచర్ ఎన్విరాన్‌మెంట్/ కన్జర్వేషన్/ప్రిజర్వేషన్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డును గెలుచుకుని రికార్డెకెక్కింది.
తర్వాత పాపారావు తన ఉద్యోగానికి తిరిగి వెళ్లాడు. కానీ 2020లో మళ్లీ రిజైన్ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో తన పదవికి రాజీనామా చేసిన తర్వాత, బియ్యాలా ఫుల్ టైమ్ ఫిల్మ్ మేకర్‌గా మారారు. ఆయన తొలి చిత్రం 'మ్యూజిక్ స్కూల్'లో శ్రియా శరణ్, శర్మన్ జోషి లాంటి స్టార్స్‌ను ఎంపిక చేసుకున్నారు. భారీ అంచనాలతో 2023 మే లో విడుదలైంది ఈ మూవీ. పాజిటివ్ రివ్యూస్ అందుకున్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.
హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్- పక్కా ఇన్స్పిరేషన్! - Inspirational movies