ETV Bharat / entertainment

ఇకపై అలాంటి సీన్స్​కు ఓకే, కానీ ఓ కండిషన్!​ : 'గుంటూరు కారం' మీనాక్షి - ముద్దు సన్నివేశాల్లో మీనాక్షి చౌదరి

'గుంటూరు కారం' బ్యూటీ మీనాక్షి చౌదరి అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఒకే చెప్పింది. కానీ కండిషన్స్ పెట్టింది. ఆ వివరాలు.

ఇకపై అలాంటి సీన్స్​కు ఓకే కానీ ఓ కండిషన్!​ : 'గుంటూరు కారం' మీనాక్షి

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 4:07 PM IST

Updated : Jan 28, 2024, 5:18 PM IST

Meenakshi Choudhary Kiss Scenes : తెరపై అలాంటి సన్నివేశాల్లోనూ నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. అయితే కొన్ని కండిషన్స్​ ఉన్నాయని పేర్కొంది. రీసెంట్​గా మహేశ్ గుంటూరు కారంతో ఆడియెన్స్​ను అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఈ విషయాన్ని చెప్పింది.

"మహేశ్‌ బాబుతో యాక్ట్ చేసే ఛాన్స్​ వచ్చిందని తెలియగానే నా ఆనందానికి అవధులు లేవు. తొలి రోజు మొదటి షాట్‌ కూడా ఆయనతోనే. నేను చాలా కంగారు పడ్డాను. నా భయాన్ని గమనించి, టెన్షన్‌ పడొద్దనీ, కావాలంటే ఇంకొంత సమయం తీసుకోమని మహేశ్‌ ధైర్యం చెప్పారు. ఆ మాటలే నాలో భయాన్ని పోగొట్టాయి. ధైర్యాన్ని ఇచ్చాయి. అయితే నేను నా కోసం కొన్ని నియమాలు పెట్టుకున్నా. అందులో ముఖ్యమైంది‘ నా కంఫర్ట్‌’. స్క్రిప్ట్‌ కొంచెం కూడా అసౌకర్యంగా అనిపించినా ముందే చెప్పేస్తాను. ఈ కారణంగానే బడా ప్రాజెక్టులను కూడా వదిలేసుకున్నాను. తెరపై కిస్​ సీన్స్​కు సంబంధించి కూడా కొన్ని నియమాలు పాటిస్తాను. స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తేనే, అది కూడా మరీ అసభ్యకరంగా లేకుంటేనే వాటిని చేస్తాను. కానీ, కేవలం కిస్​ సీన్స్​ కోసమే అంటే మాత్రం నేను కచ్చితంగా వద్దని అంటాను. తెలుగు సినిమా ఇండస్ట్రీ నాపై ఎంతో ఆప్యాయతను చూపుతోంది. భాష ఏదైనా కానీ మంచి సినిమాలు చేయాలని నా కోరిక. అందుకోసమే ఆలోచించి మరీ సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నాను. డబ్బు కన్నా ముఖ్యంగా నేను చేసే పనికి ప్రశంసలతో పాటు గౌరవం దక్కాలని ఆశిస్తాను" అని మీనాక్షి చెప్పింది.

కాగా, పంజాబీ సొగసరి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తోంది. టాలీవుడ్‌లో రెండు, మూడేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చినప్పటికీ కాస్త ఆలస్యంగా పాపులారిటినీ దక్కించుకుంది.

మొదట ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంలో టాలీవుడ్​కు పరిచయమైందీ భామ. ఆ తర్వాత మాస్‌ మహారాజ రవితేజ సరసన 'ఖిలాడి' చిత్రంలో తన అందంతో అలరించింది. ఆ సినిమా పర్వాలేదనిపించినప్పటికీ ఈ ముద్దుగుమ్మ లుక్స్​ అండ్​ పెర్ఫార్మన్స్ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకున్నాయి. అనంతరం గత ఏడాది అడివి శేష్‌తో కలిసి 'హిట్‌ 2' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు గుంటూరు కారం చిత్రంలో ఆఫర్​ను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ విషయంలో రాజమౌళి అంటే కోపం : ప్రశాంత్‌ వర్మ

అక్కనే మించిపోయేలా - సాయిపల్లవి సిస్టర్​ తీన్మార్​ డ్యాన్స్​!

Last Updated : Jan 28, 2024, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.