ETV Bharat / entertainment

రూ.200 కోట్ల 'మంజుమ్మల్ బాయ్స్'కు బిగ్ షాక్​ - పీవీఆర్​పై మైత్రీ మూవీస్ ఆగ్రహం! - Manjummel Boys - MANJUMMEL BOYS

Manjummel Boys PVR Multiplex : రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అందుకున్న మంజుమ్మల్ బాయ్స్​ తెలుగు వెర్షన్​ ప్రదర్శనలను పీవీఆర్ మల్టిఫ్లెక్స్ నిలిపివేసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

రూ.200 కోట్ల 'మంజుమ్మల్ బాయ్స్' నిలిపివేత - గొడవకు దిగిన మైత్రీ మూవీస్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 3:42 PM IST

Updated : Apr 11, 2024, 4:18 PM IST

Manjummel Boys PVR Multiplex : ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కి రూ.230 కోట్లు సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డుకెక్కింది(Manjummel Boys Collections). అయితే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి ఈ సినిమా తెలుగు వెర్షన్​ను మైత్రి మూవీస్ ఏప్రిల్ 6న విడుదల చేసింది. తెలుగు వెర్షన్ కూడా విజయవంతంగా ప్రదర్శన అవుతోంది. అయితే ఈ సినిమా నిర్మాతలతో పీవీఆర్ మల్టీప్లెక్స్​కు మధ్య గొడవలు తలెత్తడంతో ఈ సినిమా తెలుగు వెర్షన్​ను పీవీఆర్ మల్టిప్లెక్స్ గురువారం అర్ధాంతరంగా నిలిపేసింది.

ఈ విషయంపై మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి నిర్మాతల మండలిని ఆశ్రయించారు. మలయాళ సినిమా నిర్మాతతో గొడవ కారణంగా సక్సెస్ ఫుల్​గా రన్ అవుతున్న తెలుగు వెర్షన్ ను ఆపేయడం సరైన నిర్ణయం కాదని ఆరోపించారు. న్యాయం కోసం నిర్మాతల మండలిని ఆశ్రయించారు. దీంతో ఈ విషయంపై ఒక తీర్పు చెప్పేందుకు నిర్మాతల మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. పీవీఆర్ మల్టిప్లెక్స్​కు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. గతంలో కూడా ఎన్నో సినిమాల విషయంలో నిర్మాతలతో గొడవలు జరిగాయి. అయితే ఒక భాషలో నిర్మాతతో గొడవ కారణంగా మరొక భాషలో రన్ అవుతున్న సినిమాను ఆపడం ఇదే మొదటిసారి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
శ్రీనాధ్ బాసి, బాలు వర్గీస్, గణపత్, లాల్ జూనియర్, దీపక్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు చిదంబరం దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సుషీన్ శ్యామ్ సంగీతం అందించారు. షౌబిన్ సాహిర్, బాబు సాహిర్, షాన్ ఆంటోనీ కలిసి ఈ సినిమాను నిర్మించారు. మన భారతీయ భాషల్లో ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ ఇప్పటికే ఎన్నో వచ్చినా స్క్రీన్ ప్లే, నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. మరో రెండు మూడు వారాల తర్వాత ఈ సినిమా ఓటిటి ప్రేక్షకులను కూడా పలకరించనుంది.

ముంబయి 'వార్'​లో దిగిన ఎన్టీఆర్​ - పది రోజులు అక్కడే! - War 2 Shooting

కమెడియన్​గా మారిన 'పుష్ప' షెకావత్ సార్ - Fahad fazil

Last Updated : Apr 11, 2024, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.