ETV Bharat / entertainment

ఒళ్లు గగ్గుర్పొడిచే ఈ రెండు సీన్లు చూశారా - ఇప్పుడందరూ దీని గురించే చర్చ! - Manjummel Boys OTT - MANJUMMEL BOYS OTT

Manjummel Boys OTT : మంజుమ్మెల్ బాయ్స్​ ఓటీటీలో ఫుల్ రెస్పాన్స్​ను అందుకుంటోంది. ముఖ్యంగా అందరూ ఈ చిత్రంలో రెండు సన్నివేశాల గురించి తెగ చర్చించుకుంటున్నారు. దాని గురించే ఈ కథనం.

Source ANI
Manjummel Boys OTT (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 1:30 PM IST

Manjummel Boys OTT : ఈ ఏడాది మలయాళ సినిమాల హవా బాగా కనపడుతోంది. ఈ సంవత్సరం వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్​లో ఎక్కువగా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చినవే. వీటిలో మంజుమ్మెల్ బాయ్స్ కూడా ఒకటి. తక్కువ బడ్జెట్ మూవీగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్​ అయింది. హిట్ అందుకోవాలంటే స్టార్ కాస్ట్ అవసరం లేదు కంటెంట్ ఉంటే చాలు అని మరోసారి నిరూపించింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీలో కూడా విడుదలయ్యింది. థియేటర్ లాగానే ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ చిత్ర విజయంలో స్క్రీన్ ప్లే కూడా ముఖ్య పాత్ర పోషించింది. మరీ ముఖ్యంగా ఒక రెండు కీలకమైన సీన్స్ గురించి అందరూ ఎక్కువగా చర్చిస్తున్నారు.

ఒక మాములు సర్వైవల్ థ్రిల్లర్ నుంచి సూపర్ హిట్​గా మారడానికి కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో బాగా ఉన్నాయి. కథ విషయానికి కొంతమంది స్నేహితులు అందరూ కలిసి కొడైకెనాల్ టూర్ కు వెళ్తారు. అక్కడ వాళ్లు నిషేధించిన డెవిల్ కేవ్స్​కు చేరుకుంటారు. అయితే ఆ గుహను దగ్గరగా వెళ్లి చూసే క్రమంలో ఆ స్నేహితులలో ఒక వ్యక్తి అక్కడే ఉన్న డెవిల్​ లోయలో పడిపోతాడు. ఆ తర్వాత అతడిని తన స్నేహితులు ఎలా కాపాడారు అనేది స్టోరీ లైన్. అయితే ఇక్కడ అతడు లోయలోకి పడే సన్నివేశం, అతడిని బయటకు తీయడానికి స్నేహితులు కష్టపడే సీన్​ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ప్రస్తుతం ఈ రెండు సీన్ల గురించి అంతా సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నారు. స్నేహితులు లోయలోకి పడిన అతడిని బయటకు లాగే సమయంలో గుణ మూవీలో పాటను పెట్టడం, ఆ సీన్​ను మరింత ఎమోషనల్​గా మార్చిందని అభిప్రాయపడుతున్నారు. అలానే లోయలో పడిన ఆ వ్యక్తి కిందకు జారుకుంటూ వెళ్లే సన్నివేశాన్ని చిన్నతనంలో ఈత కొట్టేందుకు నదిలో దూకిన సన్నివేశాన్ని జోడిస్తూ అద్భుతంగా చూపించారు. టెక్నికల్​గా ఈ సీన్​ మ్యాజిక్​ చేసిందని అందరూ కొనియాడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ హాట్ స్టార్​లో అందుబాటులో ఉంది.

ఈ వారం OTTలోకి 15 సినిమాలు - ఆ భారీ బ్లాక్ బస్టర్ మూవీ​ కూడా! - This Week OTT Releases

చెత్తలో 10 గంటలు మాస్క్ లేకుండా - కుబేర కోసం ధనుశ్ భారీ రిస్క్​! - Kubera Dhanush

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.