Manjummel Boys Movie Cheating Case : మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ "మంజుమ్మెల్ బాయ్స్" రీసెంట్గా విడుదలై తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.250కోట్లకుపైగా వసూళ్లను అందుకుని రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్ర నిర్మాతలపై ఛీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఎర్నాకుళం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏప్రిల్ 24న "మంజుమ్మెల్ బాయ్స్" నిర్మాతలైన సౌబిన్ షాహిర్, బూబు షాహిర్, షాన్ ఆంటోనీలపై కేసు నమోదు చేశారు.
కొన్ని రోజుల క్రితం "ముంజుమ్మెల్ బాయ్స్" చిత్ర నిర్మాతలైన సౌబిన్ షాహిర్, బూబు షాహిర్, షాన్ ఆంటోనీలు తనను మోసం చేశారంటూ సిరాజ్ వలియతార అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమా విడుదల అయ్యాక వచ్చే లాభాలలో తనకు 40శాతం వాటా ఇస్తానని నమ్మించి చిత్రం కోసం తనతో రూ.7 కోట్లు పెట్టుబడి పెట్టించారని సిరాజ్ ఫిర్యాదులో పేర్కోన్నారు. తీరా సినిమా విడుదల అయ్యాక చూస్తే తనకు ఇచ్చే లాభాల ఊసే ఎత్తడం లేదనీ, ఇంత భారీ విజయం అందుకున్నాక తనతో మాట్లాడటమే మానేశారనీ ఆయన చెప్పుకొచ్చారు. లాభాల విషయం పక్కనపెడితే సినిమా కోసం తాను పెట్టిన పెట్టుబడిని కూడా వారు తిరిగి ఇవ్వలేదని, దీంతో దిక్కు తోచక న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని సిరాజ్ వాపోయారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన ఎర్నాకుళం న్యాయస్థానం పూర్తి విచారణ అనంతరం మంజుమ్మెల్ నిర్మాతలైన సౌబిన్ షాహిర్, బూబు షాహిర్, షాన్ ఆంటోనీలపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు వారిపై ఛీటింగ్ కేసు పెట్టారు.
"మంజుమ్మెల్ బాయ్స్" సినిమా విషయానికొస్తే - 2006లో జరిగిన కొన్ని యథార్త సంఘటనల ఆధారంగా ఈ సినిమాను చిదంబరం తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ బాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సర్వైవల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం అటు మలయాళంలో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లకు తీసుకొచ్చింది. ఈ చిత్రం త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా అలరించనుందనీ తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'పుష్ప 2' ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది - ఆ రోజే ఫుల్ సాంగ్ రిలీజ్ - Pushpa 2 First Single Promo
OTTలోకి వచ్చేస్తోన్న ఫహాద్ ఫాజిల్ రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా - డోంట్ మిస్! - Avesham Movie