Manisha Koirala Heeramandi : పాత్ర కోసం ఎలాంటి సాహసాన్ని అయినా చేస్తుంటారు నటీనటులు. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా భిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటుంటారు. ఇప్పుడు బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా కూడా అదే చేసింది. ఒక సీన్ కోసం ఏకంగా 12 గంటల పాటు బురద నీటిలో ఉన్నట్లు తెలిపింది. కాగా, హీరామండి ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ మే 1 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లోని ఓ సీన్ కోసమే ఆమె బురద నీటిలో ఉండి నటించింది. ఈ విషయాన్ని మనీషానే స్వయంగా తెలిపింది.
"క్యాన్సర్ తర్వాత అందులోనూ ఐదు పదుల వయసులో ఇటువంటి ఒక గొప్ప పాత్రను చేసే అవకాశం వస్తుందనుకోలేదు. నా కెరీర్లో హీరామండిలో పాత్ర ఒక పెద్ద మైల్ స్టోన్. వయసుకు తగ్గ పాత్రలు అంటూ మూస పాత్రలు కాకుండా ఇలాంటి రోల్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వల్ల ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టు విభిన్నమైన సిరీస్/సినిమాలు రూపొందుతున్నాయి. నిజానికి ఈ పాత్ర ఒప్పుకున్నప్పుడు నాకు చాలా సందేహాలు ఉండేవి. క్యాన్సర్ తర్వాత ఇలాంటి టైట్ షెడ్యూల్స్, భారీ జ్యూవెలరీ, బరువుగా ఉండే బట్టలను నా శరీరం తట్టుకోగలదా అని. అయితే ఇప్పుడు నా పాత్రకు వచ్చిన ప్రశంసలు ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేశాయి. ఒక సీన్ కోసం 12 గంటలు ఫౌంటెన్ కిందే ఉండాల్సి వచ్చింది. అయితే సంజయ్ నీరు వేడిగా, శుభ్రంగా ఉండేలా చూశారు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ బురద నీరు కూడా రావడం ప్రారంభమైంది. నా శరీరం మొత్తం బురద నీటితో తడిచిపోయింది. అసలే క్యాన్సర్ నుంచి కోలుకున్న శరీరం సున్నితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో బురద నీటితో అంతసేపు ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది పడలేదు. అప్పుడే అర్థమయింది అనారోగ్యం వల్ల, వయసు వల్ల లేదా ఇంకేదైనా సమస్య వల్ల మన పని అయిపోయింది అనుకుంటాం. కానీ కష్టపడితే అంతకుమించి ఫలితాలను పొందచ్చు. మీ అభిమానానికి కృతజ్ణతలు" అంటూ పోస్ట్‌లో తన అనుభవాన్ని రాసుకొచ్చింది మనీషా కోయిరాల.
కాగా, ఈ సిరీస్‌లో మనీషా కోయిరాలతో పాటు సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్ కూడా నటించారు. వీరందరి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌లో స్వతంత్రం రాకముందు లాహోర్‌లోని హీరామండి అనే ప్రాంతంలో ఉన్న వేశ్యల జీవితాలు ఎలా ఉండేవో చూపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="Manisha ">Manisha
'ఒక్క ఓటు' విలువ - విజయ్ దళపతి ఎంత గొప్పగా చెప్పారో చూడండి! - Vijay Thalapahy Vote Value