ETV Bharat / entertainment

'లవ్ చేసిన ప్రతిసారీ మోసపోయా' - మనీశా కోయిరాలా ఎమోషనల్ - Manisha Koirala Relationships - MANISHA KOIRALA RELATIONSHIPS

Manisha Koirala Relationships : బాలీవుడ్ నటి మనీశా కోయిరాలా తాజాగా తన రిలేషన్​షిప్​ గురించి ఓపెన్​ అయ్యారు. తాను ప్రేమించిన ప్రతిసారీ తప్పుడు వ్యక్తులే ఎదురయ్యారంటూ ఎమోషనలయ్యారు.

Manisha Koirala Relationships
Manisha Koirala (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 7:38 PM IST

Manisha Koirala Relationships : సినిమా కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లిన మనీశా కోయిరాలా, లవ్ లైఫ్‌లో చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నారట. ఇన్నేళ్లుగా తాను తప్పుడు వ్యక్తుల ప్రేమలో పడి మోసపోయానని అంటున్నారు. తన జీవితంలో పదేపదే ఒకే తప్పు చేస్తూ తీవ్రమైన నష్టానికి గురైనట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

ఒక వ్యక్తి పట్ల ఆకర్షితురాలినైన తర్వాత తన వల్ల కలిగే సమస్యలను పట్టించుకునే వారు కాదట. అలా ప్రతి రిలేషన్‌లోనూ ఒకే సమస్య రిపీట్ అవుతుండటం వల్ల, తనను ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్లు తెలిపారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పటి వరకూ సుమారు ఆరేళ్లుగా ఒంటరిగా ఉంటున్నానంటూ అంటున్నారు. ఇప్పట్లో మరే రిలేషన్‌లోనూ ఉండాలని లేదని తన కోసం ఇంకా చేసుకోవాల్సిన పని చాలా ఉందని పేర్కొంది.

ఎలాంటి వ్యక్తిని కోరుకునే వాళ్లంటే?
తనకు భాగస్వామి అయ్యే వ్యక్తి ప్రేమించడంతో పాటు ఎక్కడున్నా, ఎలా ఉన్నా నిజాయతీగా ఉండాలని ఆశించేవారట. ఆ వ్యక్తి తన వైఫల్యాల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడం కూడా ముఖ్యమని అంటున్నారు. తనకు లాగే ఏదైనా సాదించాలనే తాపత్రయమున్న వ్యక్తితో తన కలలు పంచుకోవాలని అనుకునేవారట. రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతిసారి రొమాంటిక్‌గా ఉంటూ, అంతే కాకుండా క్యాండిల్ లైట్ డిన్నర్స్ లాంటవి చేయాలని ఊహించుకునే వారట. అవేమీ జరగకపోవడం వల్ల వాటిని పట్టించుకోకుండానే రిలేషన్​లో ముందుకు వెళ్లిపోయేదాన్ని అంటూ చెప్తున్నారు మనీశా.

ప్రొఫెషనల్ కెరీర్ గురించి చెప్పాలంటే, మనీశా తన సినిమా కెరీర్‌లో హిందీ, తమిళ భాషల్లోనే ఎక్కువగా నటించారు. అనేక ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా ఆమె తన ఖాతాలో వేసుకున్నారు. టీవలే 'హీరామండి'తో పాటు 'షెజాదా అండ్ సంజూ' అనే సినిమాలో నటించారు. 'హీరామండీ'లో తన నటనకు గానూ ప్రశంసలు కూాడా అందుకున్నారు. త్వరలో తెరకెక్కనున్న 'హీరామండి 2'లో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు.

ఆ సీన్ కోసం స్టార్ హీరోయిన్​ 12 గంటల పాటు బురద నీటిలోనే! - Manisha Koirala Heeramandi

'హీరామండి చూసిన వెంటనే మనీషాకు సారీ చెప్పాను' - సోనాక్షి ఎమోషనల్ - Sonakshi Sinha Heeramandi

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.