Malayalam Movies Box office : ఇండియన్ సినిమాలలో మలయాళ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. స్టార్ డమ్ కన్నా కాన్సెప్ట్‌కే ప్రాధాన్యత ఇస్తూ తక్కువ బడ్జెట్‌తో నేచురల్‌గా సినిమాలు చేయడం వారి స్పెషాలిటీ. దీంతో వారి రేంజ్ ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు కలెక్షన్లు లేకా బాక్సాఫీస్ బోసిపోతుంటే మలయాళం ఇండస్ట్రీ మాత్రం నాలుగున్నార నెలల్లోనే రూ.1000కోట్లకుపైగా వసూలు చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ కలెక్షన్లలో 55 శాతం కేవలం మూడు సినిమాల నుంచే రావడం విశేషం. మాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్రూ(.240 కోట్లు) నిలవగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడుజీవితం ది గోట్ లైఫ్(రూ.157 కోట్లు), ఫహాద్ ఫాజిల్ ఆవేశం(రూ.153 కోట్లు) సాధించాయి. ఇక ప్రేమలు కూడా రూ.130 కోట్లకుపైనే సాధించింది. ఇంకా భ్రమయుగం, అన్వేషిప్పిన్ కండెతుమ్, అబ్రహం ఓజ్లర్ వంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా మంచి వసూళ్లను అందుకున్నాయి. అలా మొత్తంగా ఈ చిత్రాలన్ని కలిపి జనవరి నుంచి ఏప్రిల్ వరకు రూ.985 కోట్లు వసూలు చేశాయి. మే నెలలోని మొదటి 15 రోజులు కూడా కలిపి రూ.1000 కోట్లు దాటేశాయి.
కేవలం ఇండియాలో వసూళ్లనే చూసుకుంటే మలయాళం నుంచి ఇప్పటి వరకూ రూ.500 కోట్లకుపైగా వచ్చాయి. అందులో మంజుమ్మెల్ బాయ్స్(రూ.141.99 కోట్లు), ఆడుజీవితం (రూ.85 కోట్లు), ఆవేశం ( రూ.84 కోట్లు), ప్రేమలు (రూ.75 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక బాలీవుడ్ నుంచి చూసుకుంటే గతేడాది ఏకంగా రెండు రూ.1000 కోట్ల గ్రాస్ రాగా, ఈ ఏడాది అంతగా వసూలు కాలేదు. అత్యధికంగా హృతిక్ రోషన్ ఫైటర్‌కు రూ.358 కోట్లు రాగా సైతాన్ (రూ.213 కోట్లు), క్రూ (రూ.151 కోట్లు), తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా (రూ.146 కోట్లు), ఆర్టికల్ 370 (రూ.105 కోట్లు) వచ్చాయి. టాలీవుడ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ ఒక్కటే భారీ వసూళ్లను సాధించగా, గుంటూరు కారం ఫర్వాలేదనిపించాయి. ఈగల్, సైంధవ్, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు అంతగా ఆడలేదు. వేసవిలోనూ పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు.అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ సెకండాఫ్‌లో కల్కి 2898 ఏడీ, పుష్ప 2, దేవర, ఓజీ, హరిహరవీరమల్లు లాంటి సినిమాలు రానుండటంతో కలెక్షన్లు మంచిగా వచ్చే అవకాశముంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సుకుమార్ నెక్స్ట్ ఛాయిస్ ఎవరు? - బిగ్ కన్ఫ్యూజన్! - Pushpa 2 Special Song