Mahesh Babu Rajamouli Movie Launching: సూపర్ స్టార్ మహేశ్‌బాబు- దర్శకధీరుడు రాజమౌళి సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి క్రేజ్ వరల్డ్‌వైడ్‌గా పెరిగింది. ఇటు మహేశ్‌బాబుకు కూడా ఫుల్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో SSMB29 (టెంపరరీ టైటిల్) రోజూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి న్యూస్ వైరల్‌గా మారింది. 2024 ఏప్రిల్ 9 ఉగాది పండగ రోజున మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ (SSMB29) అఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ వేసవిలోనే సెట్స్‌పైకి వెళ్లనుందట. ఇక రెండేళ్లలోపే షూటింగ్ కంప్లీట్ చేసి 2026 ఉగాదికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. అయితే ఈ విషయం గురించి ఎలాంచి అధికారిక సమాచారం లేదు. కానీ, ఇప్పటికే కేఎల్ నారాయణ సినిమా ప్రొడ్యుసర్‌గా కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా సినిమా హక్కుల కోసం ట్రై చేస్తున్నట్లు టాక్.
-
#SSMB29 Pre Production Work Almost Completed 👍💥💥Update 🔥🔥🔜
— Official CinemaUpdates (@OCinemaupdates) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Regular Shoot From Ugadi 2024#MaheshBabu #SSRajamouli
pic.twitter.com/u5Agc4NDpY
">#SSMB29 Pre Production Work Almost Completed 👍💥💥Update 🔥🔥🔜
— Official CinemaUpdates (@OCinemaupdates) January 22, 2024
Regular Shoot From Ugadi 2024#MaheshBabu #SSRajamouli
pic.twitter.com/u5Agc4NDpY#SSMB29 Pre Production Work Almost Completed 👍💥💥Update 🔥🔥🔜
— Official CinemaUpdates (@OCinemaupdates) January 22, 2024
Regular Shoot From Ugadi 2024#MaheshBabu #SSRajamouli
pic.twitter.com/u5Agc4NDpY
స్క్రిప్ట్ వర్క్ పూర్తి! మహేశ్- రాజమౌళి సినిమా స్క్రిప్ట్ (Script)కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా స్ట్రిప్ట్ పూర్తైందని చెప్పారు. కాగా, బ్లాక్ బస్టర్ మూవీస్ బాహుబలి, ఆర్ఆర్ఆర్కు కూడా స్ట్రిప్ట్ అందించింది విజయేంద్ర ప్రసాదే.
Mahesh Babu Germany Tour: ప్రిన్స్ మహేశ్‌బాబు ఈ సినిమా పనుల కోసమే రీసెంట్గా జర్మనీ వెళ్లారని జోరుగా ప్రచారం సాగింది. కానీ, ఆయన ఓ డాక్టర్‌ను కలిసేందుకు జర్ననీ వెళ్లినట్లు తర్వాత తెలిసింది. ఆ డాక్టర్‌ను మహేశ్ ఇదివరకు (2022, 2023) కో రెండుసార్లు కలిశారు. అయితే ఆయన బాడీ ఫిట్‌నెస్‌కు సంబంధించి డాక్టర్ అని తెలిసింది. ఇక రాజమౌళి సినిమా అంటే ఎలాగు ఫిట్నెస్, బాడీ బిల్డప్ చేయాల్సిందే. మరి మహేశ్ అందుకోసమే వెళ్లారా? లేదా ఇంకేదైనా పని కోసం వెళ్లారా? అనేది సస్పెన్స్‌గా ఉంది.
మహేశ్ జర్మనీకి వెళ్లింది డాక్టర్‌ను కలవడానికా? - ఏమైంది?
మహేశ్, రాజమౌళి మూవీ వర్క్స్ స్టార్ట్!- ఏడాదిలో పూర్తయ్యేలా బిగ్ ప్లాన్!