Mahesh Babu Guntur Kaaram OTT Release : సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి సందడి చేసేందుకు రెడీ అయిపోతున్నాయి. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'సైంధవ్' ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే! అయితే ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మాస్ మసాలా మూవీ 'గుంటూరు కారం' ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. రమణగాడి సూపర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీ ఇంటికొచ్చేస్తోంది అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన మహేశ్ ఫ్యాన్స్ రౌడీ రమణ వచ్చేస్తున్నాడ్రోయ్ అంటూ తెగ సంబరపడిపోతున్నారు.
ఇంతకీ ఈ సినిమా కథేంటంటే?(Guntur Kaaram Movie Story) : రాయల్ సత్యం (జయరామ్), వైరా వసుంధర (రమ్యకృష్ణ) దంపతుల కుమారుడు వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేశ్‌బాబు). చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోతారు. దీంతో అతడు గుంటూరులో ఉన్న తన మేనత్త బుజ్జి (ఈశ్వరిరావు) దగ్గరే పెరుగుతాడు. ఇక వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయ శాఖ మంత్రిగా ఎదుగుతుంది. వసుంధర తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాశ్‌రాజ్) అన్నీ తానై రాజకీయ చక్రం తిప్పుతుంటారు.
వసుంధర పొలిటికల్ లైఫ్‌కు ఆమె మొదటి వివాహం, మొదటి కొడుకు అడ్డంకిగా మారకూడదని భావిస్తాడు వైరా వెంకటస్వామి. దీంతో రమణతో ఓ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. వసుంధరకు పుట్టిన రెండో కొడుకును ఆమె వారసుడిగా పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. మరి తల్లిని ఎంతో ప్రేమించే రమణ, ఆ ఒప్పందంపై సంతకం పెట్టాడా? ఇంతకీ ఆ ఒప్పందంలో ఏముంది? తన తల్లిదండ్రులు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? కన్న కొడుకుని వసుంధర ఎందుకు వదిలి పెట్టి వెళ్లిపోతుంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
బాలయ్య 'భగవంత్ కేసరి' రీమేక్ - పోటీ పడుతున్న ఆ ఇద్దరు కోలీవుడ్ స్టార్స్!
పూనమ్ పాండే డెత్ డ్రామా - చర్యలు తీసుకోవాలంటూ సినీ సెలబ్రిటీలు డిమాండ్!