ETV Bharat / entertainment

మహేశ్​ జర్మనీకి వెళ్లింది డాక్టర్‌ను కలవడానికా? - ఏమైంది? - మహేశ్ బాబు జర్మనీ ట్రిప్

Mahesh Babu Germany Trip : మహేశ్​ బాబు రీసెంట్​గా జర్మనీకి వెళ్ళింది ఒక డాక్టర్‌ను కలుసుకోవడం కోసమని తెలిసింది. ఎందుకంటే?

మహేశ్​ జర్మనీకి వెళ్ళింది డాక్టర్‌ను కలవడానికా? - ఏమైంది?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 10:02 PM IST

Mahesh Babu Germany Trip : సూపర్ స్టార్ మహేశ్​ బాబు రీసెంట్​గా జర్మనీకి సోలో ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. విదేశాలకు ఎప్పుడు కుటుంబంతో కలిసి వెళ్లే మహేశ్​ ఈసారి ఒంటరిగా వెళ్లడం వల్ల అభిమానులంతా SSMB29కి సంబందించిన వర్క్ కోసం అని అనుకున్నారు. అయితే మహేశ్​ జర్మనీకి వెళ్ళింది ఒక డాక్టర్‌ను కలుసుకోవడం కోసమని తెలిసింది. సూపర్ స్టార్​ పోస్ట్ చేసిన తాజా ఫొటో ద్వారా ఈ విషయం అర్థమైంది.

అయితే మహేశ్​ ఆ డాక్టర్​ను కలుసుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ 2023 ఏప్రిల్, 2022 జూన్‌లో కూడా మహేశ్​ ఆ డాక్టర్​ను కలుసుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలో సూపర్​ స్టార్​తో దిగిన ఫోటోలను ఆ డాక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్​లో షేర్ చేశారు. మరి ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు? మహేశ్​ ఆయన్ను ఎందుకు కలుస్తున్నారు? ఆయన దగ్గర ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం అభిమానుల మదిలో మెదులుతోంది.

అసలు ఆ డాక్టర్ పేరు 'హరీ కొనిగ్'. ఆయన బాడీ ఫిట్‌నెస్​కు సంబంధించిన డాక్టర్ అని తెలిసింది. సాధారణంగానే మహేశ్​ ఫిట్‌నెస్​పై ఎక్కువ దృష్టి పెడతారన్న సంగతి తెలిసిందే. ఖాళీ దొరికితే ఫ్యామిలీతో లేదా జిమ్​లోనే గడుపుతుంటారు. ముఖ్యంగా ఈ మధ్య SSMB29 ఒప్పుకున్నాక ఎక్కువగా జిమ్​లో కసరత్తులు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా రెగ్యులర్​గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అలా తన బాడీ ఫిట్​నెస్​కు సంబంధించి అక్కడికి వెళ్లి ఉండొచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు.

Mahesh Babu Rajamouli Movie : రాజమౌళి - మహేశ్ కాంబోలో రానున్న SSMB 29 చిత్రం భారీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కనుంది. అమెజాన్ ఫారెస్ట్​ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో మహేశ్​ కళ్లు చెదిరే యాక్షన్ స్టంట్స్ చేయబోతున్నారని కథనాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తైంది ఈ మధ్యే రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కబోతుందో చూడాలి.

నా మైండ్​ సెట్​ ఇలాగే ఉంటది : శ్రీలీల

ఆ అంజనా దేవి కుమారుడు - ఈ అంజనా దేవి కుమారుడికి ఇచ్చిన వరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.