Vettaiyan Movie Telugu Title Controversy : సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వేట్టాయన్. దసరా కానుకగా ఈ నెల 10న రిలీజ్‌కు రెడీ అయింది. అయితే సాధారణంగానే రజనీకి ఉన్న క్రేజ్ కారణంగా ఎప్పటి నుంచో ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. అలానే ఇప్పుడు వేట్టాయన్ కూడా విడుదల కానుంది.
కానీ ఇప్పుడు ఈ వేట్టాయన్ టైటిల్ విషయంలో తెలుగులో ఓ వివాదం మొదలైంది. ఎందుకు తెలుగు పేరు పెట్టలేదు అంటూ పలువురు సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి తెర లేపారు. మరికొంతమంది వేట్టాయన్ డిజాస్టర్ అంటూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు తెలుగు పేరు ఎందుకు పెట్టలేదో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వివరించింది. సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను రాసి విడుదల చేసింది. "తెలుగులో వేటగాడు అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయాలని అనుకున్నాం. కానీ ఆ పేరు అందుబాటులో లేదు. దీంతో ఒరిజినల్ పేరుతోనే విడుదల చేయబోతున్నాం. ఇతర డబ్బింగ్ వెర్షన్లకు కూడా వేట్టయన్ : ది హంటర్ అనే టైటిల్‌ను పెట్టాం. ఎప్పటిలాగానే తెలుగు ఆడియెన్స్ కూడా ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాం. టాలీవుడ్‌కు చెందిన చాలా మందితో కలిసి మేం పని చేశాం. ఆర్‌ఆర్‌ఆర్, సీతారామం వంటి తెలుగు చిత్రాలను తమిళ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చాం. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. తెలుగు భాష, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, తెలుగు మీడియా, తెలుగు ప్రేక్షకులపై లైకా ప్రొడక్షన్స్‌కు గౌరవం ఉంది" అని నిర్మాణ సంస్థ రాసుకొచ్చింది.
వేట్టాయన్ సినిమా విషయానికొస్తే - 'జై భీమ్' సక్సెస్ తర్వాత టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఇది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. దీనితో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్నారు రజనీ.
రజనీ కాంత్ వేలు పెట్టడం వల్లే నా సినిమా ఫ్లాప్! - ప్రముఖ దర్శకుడు ఆరోపణలు - Rajinikanth Flop Movie
SSMB 29 షూటింగ్ ప్రారంభం అప్పుడే - అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్