ETV Bharat / entertainment

తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి! - కానీ ఓ ట్విస్ట్​ - తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi : హీరోయిన్​​​ లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్నట్లు హెడ్​లైన్​తో బయట వార్తలు వస్తున్నాయి! దాని గురించే ఈ కథనం.

తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి! - కానీ ఓ ట్విస్ట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 1:51 PM IST

Lavanya Tripathi Mother Role : హీరోయిన్​​​ లావణ్య త్రిపాఠి గురించి తెలిసిందే. 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆడియెన్స్​ను అలరించింది. హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె ఈ మధ్యే మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్​ను పెళ్లి చేసుకుని ఆ కుటుంబంలోకి అడుగు పెట్టింది. 'మిస్టర్‌', 'అంతరిక్షం' చిత్రాల్లో కలిసి నటించిన సమయంలో ఈ జంట ప్రేమలో పడింది.

అయితే తాజాగా లావణ్య త్రిపాఠికి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అదేంటంటే ఆమె తల్లి కాబోతుందట! అయితే ఇది నిజ జీవితంలో కాదండోయ్​. రీల్​ లైఫ్​లో అట. ఇప్పటికే హీరోయిన్​గా ఆమెకు అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే ఆమె నటించిన 'మిస్ పర్ఫెక్ట్' సిరీస్​ ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్​ను అందుకుంది. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చిందని తెలిసింది. మదర్ అండ్​ సన్ సెంటిమెంట్ ఆధారంగా ఇది తెరకెక్కనుందట.

ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి ఓ స్టార్ హీరో చిన్నప్పటి రోల్​కు తల్లిగా కనిపించనుందని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. అందుకే లావణ్య త్రిపాఠి ఈ సినిమాను ఒప్పుకుందట. ప్రస్తుతం ఈ వార్తే సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకుంటున్న మెగా అభిమానులు​ లావణ్య నిజ జీవితంలో ఆ గుడ్ న్యూస్ చెబితే బాగుండు అని ఆశిస్తున్నారు. అలానే సినిమాలో హీరోకు తల్లి పాత్ర అంటే తర్వాత కెరీర్​పై ఎఫెక్ట్ పడుతోందని కూడా కాస్త ఫీలవుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Varun Tej Operation Valentine : ఇకపోతే మరోవైపు వరుణ్‌ తేజ్​ త్వరలోనే తాను నటించిన 'ఆపరేషన్‌ వాలంటైన్‌'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలుగు, హిందీ భాషల్లో మార్చి 1న ఈ సినిమా విడుదల కానుంది. చిత్రంలో వరుణ్‌కు జోడీగా మానుషి చిల్లర్‌ నటించింది.

ఆ హిట్ సిరీస్​ సీక్వెల్​ కోసం చైతూ, సమంత - ఇది అయ్యే పనేనా?

ఓ అందమైన అమ్మాయి దెయ్యంగా మారితే - OTTలోకి వెన్నులో వణుకు పుట్టించే మూవీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.