ETV Bharat / entertainment

2025 ఆస్కార్‌కు 'లాపతా లేడీస్' - ఆమె మాట నిజం అయ్యిందిగా! - Laapata Ladies Oscars 2025

Laapata Ladies Oscars 2025 : బాలీవుడ్ హిట్ మూవీ 'లాపతా లేడీస్' తాజాగా భారత్‌ తరఫున అధికారికంగా ఆస్కార్‌కు ఎంపికైంది.

Laapata Ladies Oscars 2025
Laapata Ladies Oscars 2025 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2024, 12:57 PM IST

Laapata Ladies Oscars 2025 : బాలీవుడ్​లో క్లాసిక్ హిట్​గా నిలిచి మూవీ లవర్స్​ను అలరించిన లాపతా లేడీస్ మూవీ ఇప్పుడు భారత్‌ తరఫున అధికారికంగా ఎంట్రీకి పంపిస్తున్నట్టు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. అయితే 'ఆట్టం', 'యానిమల్‌' తదితర 29 సినిమాల లిస్టు నుంచి ఈ సినిమాను ఎంచుకున్నారని తెలిపారు.

ఆమె మాట నిజం అయ్యింది
అయితే ఇటీవలే ఇదే విషయంపై ఈ మూవీ డైరెక్టర్ కిరణ్ రావ్ మాట్లాడారు. మన దేశం తరఫున ఈ సినిమా కచ్చితంగా ఆస్కార్‌కు ఎంపికవుతుందని ఓ ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్​గా చెప్పారు. "2025లో ఆస్కార్‌ అవార్డుల్లో భారత్‌ తరఫున అఫీిషియల్ నామినేషన్​కు 'లాపతా లేడీస్‌' అర్హత సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆస్కార్ వేదికపై ఈ సినిమా మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నాతో పాటు మా టీమ్​ మెంబర్స్​ కోరిక. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ సినిమాను ఆస్కార్‌కు పంపుతుందని నేను ఆశిస్తున్నాను" అంటూ కిరణ్‌రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడీ నామినేషన్స్​ అనౌన్స్​మెంట్ విన్న మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి ఆమె మాట నిజం అయ్యిందంటూ కామెంట్లు పెడుతున్నారు. టీమ్​కు కంగ్రాజ్యూలేషన్స్ తెలుపుతున్నారు.

2001 కాలం బ్యాక్​డ్రాప్​తో ఈ సినిమా రూపొందింది. పల్లెటూరికి చెందిన ఇద్దరు కొత్త పెళ్లి కూతుర్లు తమ అత్తారింటికి వెళ్లే సమయంలో ఓ రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైపోతారు. ఇది తెలియని పెళ్లికొడుకులు ఆ అమ్మాయిలను ఇంటికి తీసుకెళ్తారు. తీరా చూసుకున్నాక అసలు నిజం బయటపడుతుంది. అయితే ఈ మార్పు వల్ల ఆ ఇద్దరి అమ్మాయిల జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందనేదే మిగతా కథ.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్‌ ఈ సినిమాను తన సొంత బ్యానర్​పై నిర్మించారు. ఇప్పటికే ప్రశంసలతో పాటు గుర్తింపు అందుకుంది ఈ చిత్రం. గతంలోనూ టోరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టీఐఎఫ్‌ఎఫ్‌) వేడుకలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా, సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలో భాగంగా అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్​లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇది కాకుండా 'ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)' అవార్డుల్లోనూ లాపతా లేడీస్‌ క్రిటిక్స్‌ ఛాయిస్‌ విభాగంలో బెస్ట్‌ ఫిల్మ్‌గా అవార్డు అందుకుంది.

'షూటింగ్ మధ్యలో చదువుకునేదాన్ని - అమ్మ నా సందేహాలు తీర్చేది' - Laapata Ladies Nitashi Goel

షారుక్​, సల్మాన్​ను వెనక్కినెట్టి టాప్​లో 16 ఏళ్ల యువతి- ఎవరంటే? - IMDB Most Popular Actress

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.