Kriti Sanon Latest Interview : 'ఆదిపురుష్' సినిమాలో నటించి మెప్పించిన కృతి సనన్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అవతారమెత్తింది. వరుస సినిమాలతో కెరీర్ బిజీగా ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకుంది. 'బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్' అనే ప్రొడక్షన్ వెంచర్ మొదలుపెట్టి 'దో పత్తీ' అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నిర్మాతగా తాను పడిన కష్టం మొత్తం చెప్పుకొచ్చింది. నిర్మాత కావడం వల్ల రోజుకు 16 నుంచి 17 గంటలు పనిచేయాల్సి వచ్చేదంటూ పేర్కొంది.
"ప్రతి సీన్‌ను అదే రోజు పూర్తి చేయాలనుకునే దాన్ని. దాని కోసం ఒక్కో రోజు 16 నుంచి 17 గంటలు కష్టపడేదాన్ని. మొదట నేను ప్రొడ్యూసర్ అవ్వాలని చెప్పినప్పుడు, అందరూ ఇవాల్టి రోజుల్లో బడ్జెట్ పెరిగిపోయింది, ఇది వద్దు అనే సలహాలు ఇచ్చారు. సినిమా కోసం ప్రతి ఒక్కరికీ ఇచ్చే రెమ్యూనరేషన్లు, రోజుకు అయ్యే ఖర్చు లాంటివి మొత్తం దగ్గరుండి చూశాక, నాకు కూడా పరిస్థితి అర్థమైంది. ఇప్పుడిక నేను కూడా రాబోయ్యే సినిమాల్లో ప్రొడ్యూసర్స్ హీరోయిన్గా పనిచేయాలుకుంటున్నాను. నటిగా, నిర్మాతగా గొప్ప పేరును సంపాదించాలనుకుంటున్నాను" అంటూ కృతి చెప్పింది.
Do Patti Cast : ఇక దో పత్తి సినిమాను శశాంకా చతుర్వేది తెరకెక్కిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ఓ కొండ ప్రాంతంలో జరిగే మిస్టరీ థ్రిల్లర్ కథా నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. టీవీ యాక్టర్ షహీర్ షేక్ కూడా ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు.
మరోవైపు కృతి తన తర్వాతి ప్రాజెక్టులో భాగంగా రాజేశ్ కృష్ణణ్ తెరకెక్కించిన 'క్రూ' చిత్రంలో కనిపిస్తున్నారు. మెహుల్ సూరి, నిధి మెహ్రా రచయితలుగా కరీనా కపూర్ ఖాన్, దిలిజిత్ దోసాన్జా, టబూలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకు ఎక్తా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్, దిగ్విజయ్ పురోహిత్ నిర్మాతలుగా వ్యవహరించారు. దీన్ని మార్చి 29న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'బన్నీతో నటించాలని ఉంది - ఎవరైనా మా ఇద్దరితో సినిమా తీస్తారా?'
కాబోయేవాడు అలా ఉండాలి.. ఆ విషయంలో ప్రభాస్ బాగా హెల్ప్ చేశారు! : కృతి