ETV Bharat / entertainment

బేబమ్మకు ఈ హైప్ చాలదు - ఆ మూడు సినిమాల కోసమే వెయిటింగ్! - Krithi Shetty manamey movie - KRITHI SHETTY MANAMEY MOVIE

Krithi Shetty Manamey Movie : గత కొంతకాలంగా సాలిడ్ కమ్​బ్యాక్​ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టికి మనమే సినిమా కాస్త ఊరటనిచ్చింది. అయితే ఈ బేబమ్మకు ఈ హైప్ చాలదని సినీ వర్గాల టాక్​. మరీ బేబమ్మ కెరీర్ ఇప్పుడు ఎలా నడుస్తోందంటే?

Krithi Shetty Manamey Movie
Krithi Shetty Manamey Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 11:05 AM IST

Krithi Shetty Manamey Movie : టాలీవుడ్ స్టార్ నటి కృతి శెట్టి ప్రస్తుతం సాలిడ్​ కమ్​బ్యాక్​ కోసం ఎదురుచూస్తోంది. మూడేళ్ళ క్రితం 'ఉప్పెన' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తన నటనతో తొలి హిట్​ను ఖాతాలో వేసుకుంది. బేబమ్మగా ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. డెబ్యూ సినిమాతోనే ఆకట్టకున్న ఈ చిన్నది వరుస ఆఫర్లతో ఒక్కసారిగా బిజీ అయిపోయింది. టాప్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది.

అక్కినేని ఫ్యామిలీ కీ రోల్ ప్లే చేసిన 'బంగార్రాజు', నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగ రాయ్' లాంటి సినిమాలు వరసగా హిట్ అయ్యి ఈ అమ్మడికి అనతికాలంలోనే స్టార్​డమ్​ను తెచ్చిపెట్టాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. 'మాచర్ల నియోజకవర్గం','ది వారియర్', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'కస్టడీ' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో టాలీవుడ్​లో కృతి క్రేజ్ కూడా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు కోలీవుడ్ బాటలో నడుస్తోంది.

సరిగ్గా అదే సమయంలో 'మనమే'లో ఫీమేల్ లీడ్ రోల్ ఆఫర్​ కృతిని వరిచింది. ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్​తో కొనసాగుతోంది. అయితే ఈ కమ్​బ్యాక్ కృతికి సరిపోదని సినీవర్గాల వాదన. నటన పరంగా కృతి ఫర్వాదేనిపించలేదనప్పటికీ సినిమా హిట్ టాక్ అందుకునేందుకు ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం కృతి తమిళంలోనే మూడు సినిమాలు చేస్తోంది. కార్తీతో 'వా వాతియార్', ప్రదీప్ రంగనాథన్ లీడ్​ రోల్​లో వస్తున్న 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్', జయం రవి 'జీనీ' ఇలా వరుస సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇవన్నీ కూడా భారీ అంచనాల నడుమ వస్తున్నవే. దీంతో ఈ చిత్రాల ఫలితాలపైనే కృతి సినీ కెరీర్​ ఆధార పడనున్నట్లు సమాచారం. ఇవన్నీ హిట్ సాధిస్తే ఇక తను కోలీవుడ్​లో ఓ రేంజ్​లో సెటిల్ అయిపోతుంది. అయితే తెలుగులో మాత్రం 'మనమే' తర్వాత ఎటువంటి సినిమాలకు సైన్ చేయనట్లు తెలుస్తోంది. చూడాలి మరీ కృతి త్వరలో గుడ్​ న్యూస్ చెబుతోందో లేదో?

'రిలేషన్​లోనే ఉన్నాను - ఆయనంటే నాకు చాలా ఇష్టం' - Krithi Shetty Manamey Movie

అటు బాబు ఇటు కృతి -'ఇద్దరిలో ఒకరే ఏడవండి' అంటున్న శర్వా! - Sharwanand Manamey Teaser

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.