ETV Bharat / entertainment

కిరణ్ అబ్బవరం 'క' టీజర్ రిలీజ్- ఈ హీరో పక్కవాళ్ల ఉత్తరాలు చదువుతాడు! - KA Teaser

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 10:39 AM IST

Kiran Abbavaram KA Teaser: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'క' సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. మరి మీరు టీజర్ చూశారా?

KA TEASER
KA TEASER (Source: ETV Bharat)

Kiran Abbavaram KA Teaser: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న సినిమా 'క (KA)'. ఈ సినిమా సందీప్ అండ్ సుజీత్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై చింత గోపాలకృష్ణరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, మూవీ మేకర్స్ సోమవారం టీజర్ రిలీజ్ చేశారు. 1.33 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్​ మీరు చూశారా?

ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అంటూ టీజర్ ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరో కిరణ్ పోస్ట్​మ్యాన్​గా కనిపించనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఏంటి? అంటూ హీరో క్యూరియాసిటి క్యారెక్టర్​ను టీజర్​తో పరిచయం చేశారు. అయితే ఇందులో కిరణ్ రెండు షేడ్స్​లో నటించనున్నట్లు తెలుస్తోంది. 'నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను' అనే డైలాగ్​తో హీరో క్యారెక్టర్​పై ఆసక్తి పెంచారు. ఇక పెద్దగా వీఎఫ్ఎక్స్, సీజీ వర్స్క్​ లేకుండా సింపుల్​గా రూపొందించారు.

హీరోయిన్ తనేనా? అయితే ఈ సినిమాలో హీరోయిన్​గా పాత్ర పోషిస్తున్న నటి గురించి టీజర్​లో చెప్పలేదు. కానీ, టీజర్​లో ఓ సీన్​లో మాత్రం ఓ అమ్మాయి కనిపించింది. ఆమె చూడడానికి నటి రహస్య గోరక్​లాగా ఉంది. మరి ఈ సినిమాలో నటిస్తోంది తనేనా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మిగిలిన నటీనటుల వివరాలు ఎక్కడా చెప్పలేదు.

కాగా, ఈ సినిమాను డైరెక్టర్లు సుజిత్, సందీప్ సంయుక్తంగా పాన్​ఇండియా లెవెల్​లో తెరకెక్కిస్తున్నారు. కిరణ్​కు ఇదే తొలి పాన్ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్​గా పనిచేస్తున్నారు.

38 రోజుల్లోనే: కిరణ్​కు హీరోయిన్ రహస్య గోరక్​తో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. రాజావారు రాణివారు సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నేళ్ల ప్రేమ తర్వాత హైదరాబాద్​లో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక మరో 38 రోజుల్లో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. కాబోయే భర్త కిరణ్​కు బర్త్​డే విషెస్ చెప్తూ రహస్య పెళ్లి విషయాన్ని పరోక్షంగా బయటపెట్టింది.

రీల్ కపుల్ టు రియల్ కపుల్- కిరణ్ అబ్బవరం ఎంగేజ్​మెంట్ డేట్​ ఫిక్స్!

గ్రాండ్​గా కిరణ్ అబ్బవరం, రహస్య ఎంగేజ్​మెంట్- ఫొటోస్ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.