ETV Bharat / entertainment

రీల్ కపుల్ టు రియల్ కపుల్- కిరణ్ అబ్బవరం ఎంగేజ్​మెంట్ డేట్​ ఫిక్స్! - Raajavaaru Raani Gaaru

Kiran Abbavaram Engagement : 'రాజా వారు రాణిగారు' సినిమాతో ఆడియెన్స్​ను మెప్పించిన హీరో కిరణ్​ అబ్బవరం, నటి రహస్య జీవిత పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన తొలి చిత్రంలో నటించిన కథానాయిక తన లైఫ్​ పార్ట్​నర్​గా దొరకడం పట్ల కిరణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Raajavaaru Raani Gaaru Pair Marriage
Raajavaaru Raani Gaaru Pair Marriage
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 4:59 PM IST

Updated : Mar 11, 2024, 6:40 PM IST

Raajavaaru Raani Gaaru Pair Marriage : తెలుగు చిత్ర పరిశ్రమలో 'రాజా వారు రాణిగారు' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన జంట నిజ జీవితంలో ఒక్కటి కాబోతుంది. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, కథానాయిక రహస్య వివాహం చేసుకోబోతున్నారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు పెద్దల సమక్షంలో ఈ నెల 13న నిశ్చితార్థం చేసుకోనున్నారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ రిసార్ట్స్‌లో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా, పెళ్లి, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు కిరణ్ అబ్బవరం తెలిపారు.

rahasya gorak kiran abbavaram
కిరణ్​ అబ్బవరం- రహస్య

ఆంధ్ర కుర్రోడు
కడప జిల్లా రాయచోటిలో జన్మించిన కిరణ్​ లఘు చిత్రాలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2019లో వచ్చిన 'రాజా వారు రాణిగారు' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై 'ఎస్సార్ కళ్యాణమండపం', 'సమ్మతమే', 'వినరో భాగ్యము విష్ణుకథ', 'మీటర్', 'రూల్స్ రంజన్' చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తన తొలి చిత్రంలో నటించిన కథానాయిక రహస్య జీవిత భాగస్వామిగా దొరకడం పట్ల కిరణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'అలాంటిది ఏమీ లేదు'
'రాజావారు రాణిగారు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కిరణ్‌ అబ్బవరంకు కథానాయిక పాత్ర పోషించిన రహస్య జీవితతో సినిమా చిత్రీకరణ సమయంలోనే స్నేహం కుదిరింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని కిరణ్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఇక కిరణ్​ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'దిల్‌ రుబా', 1970 దశకం నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. మరోవైపు నటి రహస్య జీవిత రాజావారు రాణి గారు తర్వాత 'షర్బత్' అనే తమిళ చిత్రంలో నటించారు.

బ్యాచిలర్​ లైఫ్​కు ఫుల్​స్టాప్​
ఇదిలాఉంటే టాలీవుడ్​ హీరోలు తమ బ్యాచిలర్​ లైఫ్​కు ఫుల్​స్టాప్​ పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే మెగా బ్రదర్​ నాగబాబు తనయుడు వరుణ్​ తేజ్​-లావణ్యలు మూడు ముళ్లతో ఒక్కింటి వారయ్యారు. శర్వానంద్​ కూడా గతేడాది జూన్​లో వివాహం చేసుకున్నారు. మరోవైపు పంజాబీ బ్యూటీ రకుల్​ ప్రీత్​ సింగ్​ కూడా ఈ మధ్యనే ప్రియుడు జాకీ భగ్నానీని మనువాడారు.

సినీ ఇండస్ట్రీలో విషాదం- డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత

బెస్ట్ డాక్యుమెంటరీ- ఈసారి నిరాశే- ఇండియన్ ఫిల్మ్​కు దక్కని అవార్డ్

Last Updated : Mar 11, 2024, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.