ETV Bharat / entertainment

విశ్వంభర కోసం మరో సీనియర్ బ్యూటీ! - Chiranjeevi Vishwambhara - CHIRANJEEVI VISHWAMBHARA

Mega 156 Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో మరో సీనియర్ బ్యూటీ నటించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు.

Mega 156 Vishwambhara
Mega 156 Vishwambhara (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 3:02 PM IST

Mega 156 Vishwambhara: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్వకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే త్రిషతో పాటు 'విశ్వంభర'లో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తున్నారనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

సినిమా రెండో భాగంలో కనిపించే ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటిని ఎంచుకోవాలి అనుకుంటున్నారట దర్శకుడు వశిష్ట. సెకండ్ హాఫ్​లో సినిమాకే హైలైట్​గా నిలవనున్న ఈ పాత్ర కోసం వశిష్ట ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ, అది కుదరలేదని టాక్. ఇప్పుడు అదే పాత్ర కోసం మరో సీనియర్ నటి ఖుష్బూని సంపద్రించగా కథ బాగా నచ్చడం వల్ల ఆమె దానికి ఓకే చెప్పేశారనీ తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో త్రిష ద్విపాత్రాభినయం చేయనున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇందులో 'హిట్లర్' సినిమాలో లాగా చిరంజీవికి ముగ్గురు చెల్లెల్లు ఉంటారని, వారి చుట్టూ తిరిగే కథే ఇదని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. మరోవైపు సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్రను సెలక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది. నవీన్ పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పుతుందట. ఇక సినిమా నుంచి ఇప్పటికైతే పోస్టర్ తప్పా, మేకర్స్ అఫీషియల్​గా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ, పోస్టర్ చూశాక సినిమాపై మాత్రం అందరికీ అంచనాలు పెరిగాయి.

Source ETV Bharat
Source ETV Bharat (Source ETV Bharat)

ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్​తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే నిజమైతే చిరంజీవి కెరీర్​లో ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుంది. ఎమ్ఎమ్ కీరవాణి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

1977లో అనౌన్స్​మెంట్​ 2024లో రిలీజ్​కు సిద్ధం - రూ.1000 కోట్ల బడ్జెట్​తో రానున్న సినిమా! - MEGALOPOLIS MOVIE

సాయి పల్లవి ఆ హీరోతో అలా చేస్తుందా? - Saipallavi

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.