KGF 2 Raveena Tandon : సినిమా అనే రంగుల ప్రపంచంలో రాణించాలంటే అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడాలి. మనలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవాలంటే అవకాశం వచ్చేంత వరకు ఎదురుచూస్తుండాలి. అందం, అభినయం ఉండి నటించే ఛాన్స్ రాక వెనుదిగిరిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారసత్వాన్ని పక్కనపెడితే బయట నుంచి వచ్చే వాళ్లు తొలి సినిమా కోసం ఓ యుద్ధమే చేయాలి. ఇంకొంతమంది సినీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినప్పటికీ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి కష్టాన్నే ఎదుర్కొని స్టార్ హీరోయిన్ ఎదిగానంటోంది రవీనా టాండన్. స్టూడియో ఫ్లోర్లను తుడిచే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చింది.
రవీనా టాండన్ ఫిల్మ్ మేకర్ రవి టాండన్, వీణా టాండన్‌ల కూతురు. ఇండస్ట్రీలో రాణించాలంటే వారసత్వం ఉంటే సరిపోదని రవిటాండన్ కెరీర్ మనకు గుర్తు చేస్తుంది. 1990లో రవీనా టాండన్ అంటే యువతకు ఎక్కడా లేని అభిమానం. ముఖ్యంగా అందం, అభినయంతో వారి గుండెల్లో గూడుకట్టుకుంది.అయితే ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు చాలా కష్టపడిందట. ఓ ప్రముఖ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు సంఘటనల గురించి పంచుకుంది. "ఓ స్డూడియోలో నేను పనిచేస్తున్న సమయంలో ఫ్లోర్లను తుడవడం, స్టాల్స్, స్టూడియో ఫ్లోర్స్, వస్తువులతో పాటు వాంతులు చేసుకున్న చోట కూడా తుడిచాను. ప్రహ్లాద్ కక్కర్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ సమయంలో కొంతమంది నువ్వు స్క్రీన్ ముందు ఉండాల్సిన దానివి అంటుంటే నాకు అంత సీన్ లేదని చెప్పేదాన్ని. అసలు నేను నటిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. అయితే ప్రహ్లాద్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎవరైనా మోడల్స్ రాని సమయంలో మేకప్ వేసుకుని నేను పోజులిచ్చేదాన్ని. అలా మోడలింగ్ మొదలుపెట్టడంతో నాకు సినిమా ఆఫర్లు వచ్చాయి " అని తెలిపింది.
సల్మాన్ ఖాన్‌తో మొదటి హిట్ : సల్మాన్ ఖాన్ సరసన పత్తర్ కే ఫూల్ మూవీలో రవీనా టాండన్ నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్లను అందుకుంది. దీంతో రవీనాటాండన్కు ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమాతోనే రవీనా ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించాయి. అంతేకాదు రవీనా టాలీవుడ్ లోనూ నటించింది. తెలుగులో ఆమె తొలిచిత్రం బంగారు బుల్లోడు. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది.
1994లో ఏకంగా పది చిత్రాల్లో : 1994వ సంవత్సరంలో రవీనాటాండన్ ఒక్కఏడాదిలో పది సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేసింది. అందులో దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. మోహ్ర, దిల్ వాలే, ఆతీష్, లాడ్లా అనే నాలుగు సినిమాలు అత్యధిక కలెక్షన్లను అందుకున్నాయి.ఈ సినిమాల తర్వాత రవీనా వెనక్కి చూడలేదు. తన కేరీర్ పూర్తిగా పట్టాలెక్కింది. అనారీ నెం. 1, బడేమియాన్ చోటే మియాన్, ఖిలాడియోన్ కా ఖిలాడి, ఘర్వాలీ బహర్ వాలి, ఆంటీ నం.1, జిద్ది వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్‌లో నటించింది. 90లలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఆ కాలంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. కల్పనా లజ్మీ డామన్ ఎ విక్టిమ్ ఆఫ్ మ్యారిటల్ వాయిలెన్స్లో రవీనా నటనకు ఉత్తమ నటిగా జాతీయ చలన చిత్ర అవార్డును అందుకుంది.
కాగా 2011లో రవీనా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో అరణ్యక్తో కలిసి డిజిటల్ రంగ ప్రవేశం చేసింది. ఆమె నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఆ తర్వాత కేజీఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది. ఈ మూవీలో ప్రధాని పాత్రలో రవీనా చక్కగా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు పాట్నా శుక్లాపేరుతో మరో వెబ్ సిరీస్‌కు రెడీ అవుతోంది. ఇక రవీనా ఆస్తులను బాగానే కూడబెట్టుకుంది. విలావంతమైన ఇళ్లతోపాటు ఖరీదైన కార్లను కొనుగోలు చేసింది. ఆమెకు దాదాపు 166 కోట్లకు పైగానే ఆస్తులున్నాయని బయట ఇంగ్లీష్ కథనాలు ఉన్నాయి.
రాకీ భాయ్‌తో బీటౌన్ బ్యూటీ! - వాట్ ఏ కాంబో సర్జీ
50 సెకెన్లకు రూ. ఐదు కోట్లు - ఈ హీరోయిన్ డిమాండ్ మాములుగా లేదుగా