Karan Johar Body Dysmorphia : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. తాజాగా ఆయన తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, మానసిక సమస్య గురించి చెప్పుకొచ్చారు. బాడీ డిస్మోర్ఫియా అనే సమస్యతో చాలా బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ సమస్య ఉన్న వాళ్లు తమ అపీయరెన్స్‌లో, శరీరంలో ఉన్న లోపాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు.
చిన్నప్పుడు తన ఎఫెమినేట్ వాయిస్(ఆడపిల్ల లాంటి గొంతు)తో కంఫర్టబుల్‌గా ఉండేవాడిని కాదని, రహస్యంగా వాయిస్ మాడ్యులేషన్ తరగతులకు హాజరయ్యేవాడినని చెప్పారు. ఇతర అబ్బాయిలలాగా తానేందుకు లేనని చాలా సందర్భాల్లో బాధపడినట్లు పేర్కొన్నారు.
రహస్యంగా క్లాస్‌లకు - "నేను నా ఆడపిల్ల లాంటి గొంతు వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. దీన్ని సరిచేసుకునేందుకు ఓ వ్యక్తి సలహాతో పబ్లిక్ స్పీకింగ్ క్లాస్‌లో చేరాను. ఈ విషయాన్ని ఇంట్లో దాచాను. కంప్యూటర్ క్లాస్‌లకు వెళుతున్నానని మా నాన్నకు చెప్పి, వాయిస్ మాడ్యులేషన్ క్లాస్‌లకు హాజరయ్యాను." అని చెప్పుకొచ్చారు.
ఎందుకలా లేను? - "చిన్నతనంలో నా తల్లిదండ్రులు కోరుకున్న విధంగా ఉండటంలో విఫలమవుతున్నానని భావించేవాడిని. నేను వారికి పుట్టాల్సిన అబ్బాయిని కాదని అనుకునేవాడిని. చిన్నప్పుడు ఓ సారి టాలెంట్ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. అందరూ స్జేజ్‌పై పెర్‌ఫార్మెన్స్ చేస్తున్నారు. నేనూ డ్యాన్స్ చేశాను. కొంతమంది వెక్కిరిస్తూ, నవ్వడం ప్రారంభించారు. మా అమ్మ ఆ ఆడియెన్స్‌లో కూర్చుని ఉందని నాకు తెలుసు. దీంతో నేను ఇంటికి వెళ్లి తలుపు మూసేసి ఏడుస్తూ చాలా ఆలోచించాను. నేను ఇతర అబ్బాయిల్లా ఎందుకు ఉండలేను? అని ఎంతో బాధ పడ్డాను." అని పేర్కొన్నాడు.
"నాకు బాడీ డిస్మోర్ఫియా ఉంది. ఇప్పుడు కూడా పూల్‌లోకి దిగడానికి కూడా సంకోచిస్తాను. భయపడకుండా ఎలా దిగాలో కూడా నాకు తెలీదు. దాన్ని అధిగమించడానికి చాలా ప్రయత్నించాను. నేను ఎప్పుడూ ఓవర్ సైజ్డ్ క్లాత్స్ ధరిస్తాను. చివరికి ఇంటిమెసీ సీన్స్(సన్నిహితల సన్నివేశాలు) కూడా నేను లైట్స్ ఆఫ్ చేస్తాను." అని అన్నారు.
'విజయ్ దేవరకొండ మీరే మా దేవుడు' - స్టేజ్‌పై ట్రాన్స్‌జెండర్ కంటతడి - Transgender Thanks to Devarakondaకూతురు వయసున్న మోడల్‌తో 'స్పైడర్ మ్యాన్' హీరో డేటింగ్! - SpiderMan Hero Dating