ETV Bharat / entertainment

అప్పుడు ఫియర్, ఇప్పుడు ఫైర్​ - ట్రెండింగ్​లో 'కంగువ' ఫస్ట్ సింగిల్ - మీరు విన్నారా? - Kanguva First Single Released

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 1:14 PM IST

Updated : Jul 23, 2024, 1:28 PM IST

Kanguva First Single Released : స్టార్ హీరో సూర్య నటింటిన 'కంగువ' మూవీ నుంచి ఫస్ట్​ సింగిల్​ను విడుదల చేశారు మేకర్స్. దాన్ని మీరూ చూసేయండి.

Kanguva First Single Released
Suriya (ETV Bharat)

Kanguva First Single Released : తమిళ స్టార్ హీరో సూర్య త్వరలో 'కంగువ'గా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దసరా కానుకగా థియేటర్లలోకి ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్​ను రిలీజ్ చేశారు. నేడు (జులై 23)న సూర్య బర్త్​డే సందర్భంగా విడుదల చేసిన ఈ పాట మ్యూజిక్ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా ఇందులోని విజువల్స్ అలాగే, యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్ పాటకే హైలైట్​గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి చక్కటి స్వరాన్నీ అందించారు. ఆర్​ఆర్​ఆర్​ ఫేమ్ కొరియోగ్రాఫర్​ ప్రేమ్ రక్షిత్​ ఈ సాంగ్​కు అదిరిపోయే స్టెప్పులు కొరియోగ్రాఫ్​ చేశారు. 'ఆది జ్వాల, అనంత జ్వాల, వైర జ్వాల, వీర జ్వాల, దైవ జ్వాల, దావాగ్ని జ్వాల అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

Kanguva Movie Cast : కంగ అనే ఓ పరాక్రముడి కథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్యతో పాటు దిశాపటానీ లీడ్ రోల్​లో మెరవనున్నారు. పవర్​ఫుల్ విలన్ రోల్​లో బాలీవుడ్ స్టార్ బాబీ దేవోల్‌ కనిపించనున్నారు. వీరితో పాటు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. స్టూడియో గ్రీస్​ సంస్థ బ్యానర్​పై ఈ సినిమాను జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఇందులో హీరో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 38 బాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక సూర్య 'కంగువ'తో పాటు కార్తీక్‌ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న #Suriya 44లో నటిస్తున్నారు. మంగళవారం (జులై 23) సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్​ను రిలీజ్ చేసి సూర్యకు బర్త్‌డే విషెస్‌ చెప్పింది మూవీ టీమ్​. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో సూర్య ఓ గ్యాంగ్​స్టర్​ లుక్​లో కనిపించి ఆకట్టుకున్నాడు. దీన్ని చూసి ఫ్యాన్స్ ఈ పాత్ర రోలెక్స్ వైబ్స్​లో ఉందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

'ఆ మూవీలో నా రోల్​ కొత్తగా ఉంటుంది - నా కంఫర్ట్‌ జోన్‌లో అస్సలు లేదు'

మాట నిలబెట్టుకున్న హీరో సూర్య - ఏం చేశారంటే?

Last Updated : Jul 23, 2024, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.