ETV Bharat / entertainment

'ఎమర్జెన్సీ' ట్రైలర్ రిలీజ్- పవర్​ఫుల్ ఉమెన్​గా కంగనా రనౌత్​! - Kangana Ranaut Emergency

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 1:27 PM IST

Updated : Aug 14, 2024, 2:26 PM IST

Kangana Ranaut Emergency Trailer: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ లీడ్​ రోల్​లో నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా ట్రైలర్ బుధవారం రిలీజైంది.

Kangana Ranaut Emergency
Kangana Ranaut Emergency (Source: ANI)

Kangana Ranaut Emergency Trailer: బాలీవుడ్ క్వీన్​ కంగనా రనౌత్ లీడ్​ రోల్​లో నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా ట్రైలర్ బుధవారం రిలీజైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో నటి కంగన ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాకు కంగనయే స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జయప్రకాశ్​ నారాయణ్‌ పాత్రలో స్టార్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. ఇక జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్​ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమా వరల్డ్​వైడ్​గా సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది.

కాగా, చాలా రోజుల కిందటే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. పలు కారణాల వల్ల అనేక సార్లు చిత్రీకరణ వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు సెప్టెంబర్​లో థియేటర్లలోకి రానుంది. ఇక గతంలో దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా 'తలైవీ' అనే సినిమాను తెరకెక్కించగా, అందులో కంగనా జయలలిత పాత్రలో కనిపించి మంచి గుర్తింపు పొందారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Kangana Ranaut Movies: కంగనా రనౌత్ ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక క్యారెక్టర్లలో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు లేడీ ఓరియెంటెడ్​ సినిమాల్లోనూ ఆమె నటించి మెప్పించారు. ఇటీవలే ఆమె లీడ్​ రోల్​లో 'తేజస్'​ అనే సినిమా థియేటర్లలోకి వచ్చారు. ఇందులో ఆమె యుద్ధ విమానాన్ని నడిపే ఓ ఫైటర్​గా కనిపించారు. భారీ బడ్జెట్​తో విడుదలైన ఆ మూవీ ఆశించిన స్థాయిలో హిట్​ టాక్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ కంగనా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతకుముందు వచ్చిన 'చంద్రముఖి-2' కూడా కంగనాకు మంచి హిట్​ను ఇవ్వలేకపోయింది. దీంతో ఎమెర్జెన్సీపైనే కంగనా ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ సక్సెస్​ సాధించి కంగనాకు బ్రేక్​ ఇవ్వాలని ఆశిస్తున్నారు.

'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్​ డేట్​ - మేకర్స్ కీలక ప్రకటన!

కంగనా మూవీ మరోసారి పోస్ట్​పోన్​ - కారణం ఏంటంటే? - Emergeny Movie

Last Updated : Aug 14, 2024, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.