ETV Bharat / entertainment

'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్​ డేట్​ - మేకర్స్ కీలక ప్రకటన!

Kanagna Ranaut Emergency Release Date : కంగనా రనౌత్​ డైరెక్షన్​లో తెరకెక్కిన 'ఎమెర్జెన్సీ' మూవీకి మేకర్స్​ తాజాగా రిలీజ్​ డేట్​ను లాక్​ చేశారు. ఇంతకీ ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు రానుందంటే ?

Kanagna Ranaut Emergency Release Date
Kanagna Ranaut Emergency Release Date
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 11:37 AM IST

Updated : Jan 23, 2024, 12:06 PM IST

Kanagna Ranaut Emergency Release Date : బాలీవుడ్​ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్​ సొంత బ్యానర్​పై తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. ఇండియన్​ ఐరన్ లేడీ ఇందిరా గాంధీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్​పై మేకర్స్​ ఓ అప్​డేట్​ ఇచ్చారు. ఈ ఏడాది జూన్​ 14న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు 'ఎమర్జెన్సీ' మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్​ను కూడా విడుదల చేశారు. ఇందులో కంగనా అచ్చుగుద్దినట్లు ఇందిరలా కనిపించేలా మేకర్స్ చూపించారు. 1975 నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నట్లు పోస్టర్స్​ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో కంగనాతో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, నటి మహిమా చౌదరి, సీనియర్ స్టార్ శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్ సంస్థ, మణికర్ణిక ఫిల్మ్స్​ సంయుక్తంగా ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. గతంలో దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా 'తలైవీ' అనే సినిమాను తెరకెక్కించగా, అందులో కంగనా జయలలిత పాత్రలో కనిపించి మంచి గుర్తింపు పొందారు.

Kangana Ranaut Latest Movies : కంగనా రనౌత్ ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక క్యారెక్టర్లలో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు లేడీ ఓరియెంటెడ్​ సినిమాల్లోనూ ఆమె నటించి మెప్పించారు. ఇటీవలే ఆమె లీడ్​ రోల్​లో 'తేజస్'​ అనే సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇందులో ఆమె యుద్ధ విమానాన్ని నడిపే ఓ ఫైటర్​గా కనిపించారు. భారీ బడ్జెట్​తో విడుదలైన ఆ మూవీ ఆశించిన స్థాయిలో హిట్​ టాక్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ కంగనా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతకుముందు వచ్చిన 'చంద్రముఖి-2' కూడా కంగనాకు మంచి హిట్​ను ఇవ్వలేకపోయింది. దీంతో ఎమెర్జెన్సీపైనే కంగనా ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ సక్సెస్​ సాధించి కంగనాకు బ్రేక్​ ఇవ్వాలని ఆశిస్తున్నారు.

Last Updated : Jan 23, 2024, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.