ETV Bharat / entertainment

అడ్వాన్స్​ బుక్కింగ్స్​లో 'కల్కి' క్రేజ్​ - RRR, 'సలార్​'ను దాటేస్తుంది! - Kalki 2898 AD - KALKI 2898 AD

Kalki US Advance Booking Collection : ప్రభాస్ లీడ్​ రోల్​లో రూపొందిన 'కల్కి 2898AD' మూవీ రిలీజవ్వకుండానే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటికే ప్రీ బుక్కింగ్స్ మొదలవ్వగా, అమెరికన్ మార్కెట్​లో రికార్డు స్థాయిలో టిక్కెట్లు అమ్ముడయ్యాయట. ఇంతకీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Kalki US Advance Booking Collection
Kalki US Advance Booking Collection (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 5:54 PM IST

Kalki US Advance Booking Collection : ప్రభాస్ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు క్రియేట్ అయిన హైప్ వల్ల అడ్వాన్స్ టికెట్లు కూడా బాగానే అమ్ముడుపోయాయట.

ఈ నేపథ్యంలో 'కల్కి' తాజాగా ఓ రికార్డు సంపాదిచింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమెరికా, కెనడాలో 66,000 టికెట్లు అమ్ముడయ్యాయట. దాని ద్వారా ఈ చిత్రం ఇప్పటివరకూ సుమారు 2.2 మిలియన్ల కలెక్షన్లు సంపాదించిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కేవలం అమెరికాలోనే తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ఈ రికార్డు బ్రేక్ సేల్స్​కు ఒక కారణమని తెలుస్తోంది.

సాధారణంగా నార్త్ అమెరికాలో మన తెలుగు సినిమాలకు సెపరేట్ ఫ్యాన్​ బేస్ ఉంది. అందుకే మన సినిమాలు అక్కడ కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తుంటాయు. ఇప్పటికే అత్యథిక కలెక్షన్లు అందుకున్న లిస్ట్​లో 'ఆర్​ఆర్​ఆర్​' సుమారు 2.75 మిలియన్ల కలెక్షన్స్​తో మొదటి స్థానంలో ఉండగా, 2.3 మిలియన్స్​తో ఆ తర్వాతి స్థానాన్ని 'సలార్' చేజిక్కించుకుంది. ఇప్పుడు 'కల్కి 2898 AD' మూవీకి కూడా అక్కడ భారీగా క్రేజ్ ఏర్పడింది. దీంతో రానున్న రోజుల్లో మరింత సంపాదించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే, జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు మాళవిక నాయర్​, పశుపతి, శోభన లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు.

మొదటి టికెట్​ ఆయనకే
ఇటీవలే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. ఇందులో నటించిన వారందరూ ఆ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు. అక్కడే ఈ చిత్రం మొదటి టికెట్​ను నిర్మాత అశ్వినీదత్ దగ్గర నుంచి బిగ్​బీ అమితాబ్ బచ్చన్​ కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాన్ని అదే వేదికగా​ తన స్నేహితుడైన కమల్ హాసన్​కు గిఫ్ట్​గా ఇచ్చారు.

'కల్కి' రిలీజ్ ట్రైలర్​కు సెన్సేషనల్ రెస్పాన్స్!

'కల్కి' సెకండ్ ట్రైలర్ రిలీజ్- మీరు చూశారా? - Kalki Second Trailer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.