Kalki Trailer Release: మైథలాజికల్, సైఫై డ్రామాగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 AD'. మూవీటీమ్ ప్రమోషన్లో సైతం క్రియేటివిటీ కనబరుస్తోంది. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఏవో ఒక నోరూరించే అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. రీసెంట్‌గా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో 'ప్రిల్యూడ్' యానిమేటెడ్ వీడియో రిలీజ్ చేశారు.
ఇప్పుడు ప్రమోషన్‌కు మరింత జోష్ పెంచేలా ట్రైలర్‌ను ప్రముఖ నగరంలో విడుదల చేయాలని ప్లాన్ చేశారట. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో గ్రాండ్‌గా నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు కూడా హాజరవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ ట్రైలర్ జూన్ 7న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం అతి త్వరలోనే రానుంది.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి లాంటి భారీ తారాగణంతో దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బుజ్జి (కారు) అనే పాత్రకు కీర్తి సురేశ్ డబ్బింగ్ చెబుతున్నారు. విష్ణు భగవానుడి 11వ అవతారమైన కల్కి గురించి ఈ సినిమాలో చెప్పబోతున్నారు. ఈ టైటిల్ రోల్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు. ఇక పరశురాముడి క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. బిగ్ బీ మీద ప్రత్యేకంగా ఒక టీజర్ రిలీజ్ చేసి ఈ విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
కాగా, ఈ సినిమా జూన్ 27న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడం వల్ల ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. సినిమా కోసం రెడీ చేసిన బుజ్జి (డిజైన్డ్ కారు) ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో తిరుగుతోంది. ఇక 'కల్కి 2898 AD' రన్ టైమ్ కూడా ఇటీవల లాక్ అయ్యింది. ఈ మూవీ 2గంటల 49 నిమిషాల పాటు ప్రేక్షకులను అలరించనుంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు.
క్లీంకారకు 'కల్కి' స్పెషల్ గిఫ్ట్స్- ఏం పంపించారంటే?
ప్రభాస్ అలా చేస్తేనే ఆయనతో మళ్లీ కలిసి నటిస్తా : బాలీవుడ్ బ్యూటీ