kalki 2898 AD: ప్రభాస్ నటించిన 'కల్కీ 2898 AD' సినిమా ప్రమోషన్స్‌లోనూ వైవిధ్యం కనబరుస్తున్నారు డైరెక్టర్ అశ్విన్. సైఫై ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమా కోసం కస్టమైజ్‌డ్ కార్ 'బుజ్జీ'తో ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రతి క్యారెక్టర్ ఈ స్పెషల్ వెహికల్‌లో ఎంట్రీ ఇస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నారు. ముందుగా ప్రభాస్ క్యారెక్టర్ అనౌన్స్ చేసింది టీమ్. అంతకంటే ముందుగా స్పెషల్ క్యారెక్టర్ బుజ్జీని పరిచయం చేశారు నాగ్ అశ్విన్. పరశురామ క్యారెక్టర్‌లో బిగ్ బీ కనిపించనుండగా ఆయన కోసం స్పెషల్‌గా ఒక టీజర్ రిలీజ్ చేశారు.
కాగా, కల్కి జూన్ 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ సమాచారాన్ని బట్టి 'కల్కి 2898 AD' సినిమాను 3డీ (3D)లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కాకపోతే ఈ 3డీ వర్షన్ గురించి నిర్మాతల నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. సినిమా రిలీజ్ కావడానికి దాదాపు నెల ఉండగా మార్కెటింగ్‌లో వాడుతున్న కొత్త స్టైల్ బాగానే వర్కౌట్ అవుతుంది.
మైథలాజికల్, సైఫై ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశ్వినీదత్ నిర్మాతగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సినిమా రూపొందుతోంది. సంతోష్ నారాయణన్ సారథ్యంలో సంగీతం సమకూరుస్తున్నారు.
ప్రభాస్‌కు కథ వినిపించాలని: అభిమానులకు ప్రభాస్‌ను సూపర్ హీరోగా చూపించాలని కథ సిద్ధం చేసుకున్న నాగ్ అశ్విన్ ఈ కథ వినిపించేందుకు నేరుగా కలవలేదట. ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణంరాజు భార్యకు ముందుగా కథ వినిపించారట. ఆమె ఓకే అన్న తర్వాతే ప్రభాస్ దగ్గరకు కథ వెళ్లిందట. ఆ తర్వాత ప్రభాస్‌ను నాగ్ అశ్విన్ కలవడం, సినిమా ఓకే చేయడం లాంటి అప్‌డేట్స్ మొత్తం తెలిసినవే.
ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం కల్కీ. అందుకే సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే నెల అంటే జూన్ 27న సినిమాను రిలీజ్ కానుండటంతో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్‌లో రాజాసాబ్ షూటింగ్లో పాల్గొంటారు.
'కల్కి' ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్- వచ్చేది అప్పుడే!
6వేల కేజీల బరువు- రూ.7 కోట్ల బడ్జెట్- 'బుజ్జి' కోసం ఇంజినీర్ నాగ్! - Kalki Bujji