Kalki 2898 AD Sequel : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ సాధిస్తోంది. విడుదలైన అన్నీ భాషల్లోనూ రికార్డు స్థాయిలో వ్యూవ్స్ సాధిస్తోంది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'కల్కి 2' గురించే చర్చలు జరగుతోంది. అయితే ఈ సీక్వెల్‌పై నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నదత్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
" కల్కి 2898 ఏడీ సీక్వెల్ షూటింగ్ మరో ఐదు లేదా నెలల్లో ప్రారంభం కానుంది. అంటే 2025 జనవరి లేదా ఫిబ్రవరి కల్లా ఈ మూవీ సెట్స్‌లోకి వెళ్లే అవకాశాలున్నాయి. అందుకే షూటింగ్ ప్రారంభమయ్యాకే మేము ఈ సీక్వెల్ గురించి మీకు క్లారిటీగా చెప్పగలం. అయితే 'కల్కి 2898 ఏడీ' హిట్ కావడం వల్ల మాలో ఉన్న కంగారు పోయి కాస్త ఉత్సాహం పెరిగింది. పార్ట్-1 కోసం మేమంతా నాగీ విజన్ ప్రకారమే నడుచుకున్నాం. మీరు ఈ విజువల్స్ చూసే వరకు చాలా విషయాలు అర్థం కావు. ప్రేక్షకులు దీన్ని రిసీవ్ చేసుకున్న తీరును మేమందరం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. అందుకే పూర్తి ఎనర్జీతో రెండో భాగాన్ని తెరకెక్కించనున్నాం'' అంటూ స్వప్న దత్, ప్రియాంక దత్ క్లారిటీ ఇచ్చారు.
Saripoda Sanivaram Nani Kalki 2898 AD Sequel : నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' చిత్రంతో పుల్ జోష్‌లో ఉన్నారు. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన హీరో నాని 'కల్కి 2898 ఏడీ' సినిమాలో తాను ఉన్నారో లేదో స్పష్టం చేశారు.
'కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో మీరు కృష్ణుడిగా కనిపిస్తారా? ఆ అవకాశం ఉందా?' అని అడిగిన ఓ ప్రశ్నకు నాని ఆసక్తికరంగా బదులిచ్చారు. "అస్సలు లేదు. నాకు తెలిసి సెకండ్ పార్ట్‌లో కృష్ణుడి పాత్ర కన్నా అర్జునుడు, కర్ణుడి పాత్రలే ఎంతో కీలకం. ఈ సీక్వెల్‌లో కృష్ణుడి ముఖాన్ని చూపించనని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇదివరకే చెప్పారు. నేను రెండో భాగంలో ఉన్నట్లు రూమర్స్ ఎలా ప్రారంభమయ్యాయో నాకు తెలీదు. బహుశా నేను కల్కి టీమ్‌తో కలిసి ఎక్కువ సార్లు కనిపించడమే ఇందుకు కారణం. ఇందులో గెస్ట్ రోల్ చేయడంపై నాతో ఇప్పటి వరకు ఎవరూ చర్చించలేదు. నేను ఏ చిత్రంలోనూ గెస్ట్ రోల్స్ చేయలేను. కానీ కల్కి టీమ్‌తో కలిసి పని చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను" అని వెల్లడించారు.
ఆ దేశంలో 'కల్కి' రిలీజ్‌కు సన్నాహాలు - మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ - Kalki 2898 AD RRR Movies