Prabhas Insta Account : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు చెబితే తెలియని వారుండరేమో. తన సిక్స్ ఫీట్ కటౌట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ టాలీవుడ్ హీరో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మన డార్లింగ్ సహజంగానే సిగ్గరి అన్న సంగతి తెలిసిందే. నలుగురిలో ఉన్నప్పుడు కాస్త తక్కువగానే మాట్లాడుతుంటారు. వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ షేక్ చేసే ఆయన స్టేజ్‌పై మైక్ పట్టుకుంటే లైట్‌గా ఆయనే షేక్ అయిపోతుంటారు! ఇక సోషల్ మీడియాలోనూ అంతే. అయితే ఓ సారి ప్రభాస్ ఇన్‌స్టా సంగతులపై ఓ లుక్కేద్దామా.
డార్లింగ్ ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్‌కు 12.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆయన మాత్రం కేవలం 18 మందినే ఫాలో అవుతున్నారు. ఈ లిస్ట్‌లో తన పెద్దనాన్న, దివంగత నటుడు కృష్ణంరాజుతో పాటు తనతో కలిసి నటించిన హీరోయిన్లు శృతిహాసన్, దీపికా పదుకొణె, కృతి సనన్, శ్రద్ధా కపూర్, పూజా హెగ్దేతో పాటు రాధేశ్యామ్లో తనకు తల్లిగా నటించిన భాగ్యశ్రీ ఉన్నారు.
ఇంకా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, సన్నీ సింగ్, పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుల్లో నాగ్ అశ్విన్, సుజీత్, ఓం రౌత్, మారుతీ, రాధాకృష్ణ, సందీప్ వంగతో పాటు ఫిల్మ్ ఎడిటర్ డానీ బ్రకమొంటెనెస్ను ఫాలో అవుతున్నారు.
అయితే ప్రభాస్ ఖాతాలో మొత్తం తన సినిమాలకు. సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. పర్సనల్ ఫొటోస్, వీడియోలు గానీ ఏమీ ఉండవు. అలానే అందులో అతికొద్ది మందికి మాత్రమే శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభాస్ తొలిసారి 2019 ఏప్రిల్ 17న తొలి పోస్ట్ పెట్టారు. అది బాహుబలి సినిమాలోని యాక్షన్ స్టిల్. క్యాప్షన్ కూడా ఏమీ రాయలేదు. ఆ పోస్ట్‌కు 12.90లక్షల లైక్స్ వచ్చాయి.
ఇక తన సినిమాలు కాకుండా ఇతర చిత్రాలపై ప్రభాస్ పోస్టులు పెట్టారు. కానీ అది చాలా తక్కువ. వాటిలో ప్రధాని మోదీపై తీసిన మన్ భైరాగి, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, సీటీమార్, లవ్‌స్టోరీ, కాంతార, మిస్ శెట్టి-మిస్టర్ పొలిశెట్టి.
తన పెద్దనాన్న కృష్ణంరాజు సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్ని అభిమానులు ఎడిట్ చేసిన వీడియోను ప్రభాస్ పోస్ట్ చేశారు. అందులో కొన్ని యాక్షన్స్ స్టిల్స్ ఒకేలా ఉండటం విశేషం.
మొత్తంగా ఇప్పటి వరకు ప్రభాస్ 226 పోస్టులు పెట్టారు. వాటిలో దాదాపు సగం పోస్టులకు 10 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. అత్యధికంగా 'సాహో' సర్ప్రైజ్పై ప్రభాస్ చేసిన వీడియోకు 4.9 మిలియన్, రాధేశ్యామ్ టీజర్‌కు 3.8 మిలియన్ లైక్స్ వచ్చాయి.
ఇది సార్ ప్రభాస్ బ్రాండ్ - ఈ సినిమాల వసూళ్లన్నీ రూ.500 కోట్లుపైనే! - Kalki 2898 AD Collections
ఓవర్సీస్లో కల్కి దూకుడు- తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్! - Kalki 2898 AD