ETV Bharat / entertainment

ప్రభాస్ లేటెస్ట్​ లుక్​ - లాంగ్ హెయిర్, గడ్డంతో కటౌట్ అదిరింది బాస్​! - Kalki 2898 AD - KALKI 2898 AD

Kalki 2898 AD Prabhas New look Viral : ప్రభాస్ సరికొత్త లుక్ బయటకు వచ్చింది. ఇందులో లాంగ్ హెయిర్, గడ్డంతో ప్రభాస్ అదిరిపోయే కటౌట్​లో కనిపించారు. మీరు చూశారా?

Etv Bharat
ప్రభాస్ లేటెస్ట్​ లుక్​ - లాంగ్ హెయిర్, గడ్డంతో కటౌట్ అదిరింది బాస్​!
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 3:58 PM IST

Kalki 2898 AD Prabhas New look Viral : బాహుబలి తరువాత ప్రభాస్ లుక్స్​లో చాలా వరకు ఛేంజెస్ వచ్చిన సంగతి తెలిసిందే. అలానే ఆయన అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నారని కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన బాడీ ఫిట్‌నెస్​పై పెద్దగా దృష్టి సారించలేకపోయారని ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. అయితే రీసెంట్​గా సలార్​తో బిగ్ సక్సెస్ అందుకున్న డార్లింగ్​ త్వరలోనే కల్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం కోసం ప్రభాస్​ కొత్త లుక్​లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయిన సంగతి తెలిసిందే.

అలానే రాజాసాబ్​ సినిమా షూటింగ్​లోనూ పాల్గొంటున్నారు. అలా ఈ మధ్య ఈ మూవీ​ షూటింగ్​ సెట్​లో అడుగుపెట్టినప్పుడు ఆయనకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. గడ్డం, లాంగ్ హెయిర్​తో టోపీ పెట్టుకుని కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు సంబంధించిన కొత్త లుక్​ ఫొటోస్ మరింత క్లారిటీతో ఫేస్ రివీల్ అయ్యేలా కనిపించాయి. ప్రస్తుతం అవి ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి. కల్కి 2898 ఏడీ కోసం ఈ లుక్​ అంటూ ఈ సినిమా హ్యాష్​ట్యాగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఈ లుక్ చూసిన నెటిజన్లు, ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆ పిక్స్​ను తెగ షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

మరోవైపు నేడు(ఏప్రిల్ 23) నాగ్ అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రభాస్​ స్పెషల్ బర్త్​డే విషెస్ తెలిపారు. అద్భుతమైన దర్శకుడు నాగ్ అశ్విన్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్కి విషయంలో నీ విజన్ నాకు స్ఫూర్తిని ఇస్తుంది అంటూ నాగ్ అశ్విన్ ఫొటో పోస్ట్ చేసి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా నెట్టింట వైరల్​గా మారాయి.

కాగా సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా కల్కి 2898 ఏడీ తెరకెక్కుతోంది. మహాభారతంలోని పాత్రలను నేటి కలియుగానికి లింక్ చేస్తూ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. హిందూ పురాణాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్య పాత్రలను సూపర్ హీరోలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్​తో ఇది తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అశ్వత్థామగా బిగ్​బీ - కల్కి నుంచి అమితాబ్ లుక్ వైరల్! - Amitabh Bachchan Kalki 2898 AD

'సలార్- 2' క్రేజీ అప్డేట్- ప్రభాస్​​​ మూవీలో బాలీవుడ్ బ్యూటీ! - Salaar Part 2 Heroine

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.