ETV Bharat / entertainment

బడ్జెట్​ మించిన కలెక్షన్స్ - ప్రీ రిలీజ్ బిజినెస్​లోనూ 'కల్కి' జోరు! - Kalki 2898 AD Movie - KALKI 2898 AD MOVIE

Kalki 2898 AD Pre Release Business : రిలీజవ్వకముందే ఎన్నో రికార్డులను సాధిస్తోంది 'కల్కి 2898 ఏడీ మూవీ'. తాజాగా ప్రీరిలీజ్ బిజినెస్​లోనూ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుందట. అదేంటంటే ?

Kalki 2898 AD  Movie
Prabhas (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 5:57 PM IST

Kalki 2898 AD Pre Release Business : కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాకుండానే నెట్టింట బజ్​ క్రియేట్ చేసి దూసుకెళ్తుంటాయి. అందులో నటించే స్టార్​తో పాటు కథపై ఇంట్రెస్ట్​తో ప్రేక్షకులు ఆ సినిమాకు అలా హైప్​ ఇస్తుంటారు. అటువంటి సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా ఒకటి. భారీ అంచనాలతో పాటు బడ్జెట్​ నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రిలీజవ్వకముందే ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంటోంది. ఈ నేపథ్యంలో కల్కి సినిమా గురించి ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్​లో సాగినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్​తో విడుదలైన ఈ మూవీ ఈ బిజినెస్ ద్వారా దాదాపు రూ. 700 కోట్లను వసూలు చేసిందని సమాచారం. ఇది చూస్తుంటే అంటే సినిమాపై అభిమానుల అంచనాలు ఏ రేంజ్​లో ఉన్నాయో ఇట్టే అర్థమైపోతోంది.

ఇదిలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా ఓ రేంజ్​లో అమ్ముడుపోయాయని సమాచారం. దీని కోసం పలు ఓటీటీ సంస్థలు ఆశ్రయించగా రూ. 200 కోట్లతో ఓ ప్లాట్​ఫామ్​ దాన్ని కొనుగోలు చేసినట్ల సమాచారం.

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన "ఫైటర్" సినిమా బాక్సాఫీసు వద్ద రూ.337 కోట్లు సంపాదించింది. గతేడాది విడుదలైన 'డంకీ' కూడా హిట్ టాక్ సొంతం చేసుకుని రూ.470 కోట్లు ఆదాయం గడించింది. ఇక 'గద్దర్-2' కూడా రూ.692 కోట్లు దక్కించుకుంది. ఇలా బాక్సీఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన చిత్రాలన్నింటినీ మించి 'కల్కి' రిలీజ్ కాకుండానే రూ.700 కోట్లు సంపాదించింది రికార్డుకెక్కింది. ఇదే జోరు కొనసాగిస్తే, 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్-2', 'బాహుబలి' వంటి సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల టాక్.

ఇక 'కల్కి 2898 ఏడీ' సినిమా విషయానికి వస్తే, ఇది భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఇందులో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన సరసన దిశా పటానీ హీరోయిన్​గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు బిగ బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎట్టకేలకు ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ కన్ఫామ్ - వచ్చేది ఆ రోజే - Kalki 2898 AD Release Date

ఆ హాలీవుడ్ మూవీకి​ కల్కి కాపీనా? - నాగ్‌ అశ్విన్‌ అదిరిపోయే ఆన్సర్​! - Prabhas Kalki 2898 AD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.