ETV Bharat / entertainment

కమల్​ హాసన్ దగ్గరున్న ఈ 5 అల్ట్రా కాస్ట్లీ​ ప్రాపర్టీస్ తెలుసా!? - Kalki 2898 AD Kamal Hassan - KALKI 2898 AD KAMAL HASSAN

Kalki 2898 AD Indian 2 Kamalhassan Expensive Things : కమల్ హాసన్​ విశ్వ నటుడిగానే తెలుసు. మరి ఆయన దగ్గరున్న అల్ట్రా ఎక్స్​పెన్సివ్​ ప్రోపర్టీస్ గురించి మీకు తెలుసా? దాని గురించే ఈ కథనం.

source ETV Bharat
kamal hassan (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 8:43 PM IST

Kalki 2898 AD Indian 2 Kamalhassan Expensive Things : బాల నటుడి స్థాయి నుంచి విశ్వనటుడిగా ఎదిగిన కమల్ హాసన్ ఇండియన్ సినిమాకే ఒక వరం. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ తన కెరీర్‌లో 230కి పైగా సినిమాలు చేశారు. తమిళం, మలయాళం, హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ సినిమాల్లో నటించి మెప్పించారు. నాలుగు సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్న కమల్ మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.

రీసెంట్‌గా ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ADలో నటించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణెతో కలిసి నటించారు. మరికొద్ది రోజుల్లో అంటే జులై 12న రానున్న ఇండియన్-2లోనూ కథానాయకుడిగా కనిపించనున్నారు.

అయితే కొన్ని ఇంగ్లీష్ మీడియా కథనాలు ప్రకారం కమల్ హాసన్ ఆస్తులు దాదాపు రూ.450కోట్లకు పైమాటే! సినిమాలకు తీసుకునే రెమ్యూనరేషన్‌తో పాటు తమిళ బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ నిర్మాతగా, కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ డబ్బు ఆర్జిస్తున్నారు కమల్. ఇండియన్-2 సినిమాకైతే ఏకంగా రూ.150 కోట్ల వరకు డిమాండ్ చేసి చెక్ అందుకున్నారట. తమిళ బిగ్ బాస్ -7కు హోస్ట్‌గా వ్యవహరించేందుకు రూ.130 కోట్లు అడిగారట.

కమల్ హాసన్ ఖరీదైన విలాసవంతమైన ప్రోపర్టీలు ఇవే
కోట్లు విలువ చేసే బంగ్లా - 2021లో కమల్ హాసన్ ప్రభుత్వానికి తన దగ్గర రూ.131 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెలిపారట. 17.79 కోట్లు విలువ చేసే 35.59 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.19.5 కోట్లు విలువ చేసే రెండు లగ్జరీ ప్లాట్లు కూడా ఉన్నాయి.

అలానే చెన్నైలో రూ.92.05 కోట్ల విలువ చేసే బంగ్లా కూడా ఉందట!

లండన్‌లో లగ్జరీ ఇల్లు - కమల్ హాసన్​తో పాటు ఆయన కుటుంబం లండన్‌కు తరచూ వెళ్తుంటారు. వెళ్లిన ప్రతిసారి అక్కడే ఉండేందుకు ఓ మ్యాన్షన్​ను కొనుగోలు చేశారు. దానిపై రూ.2.5కోట్లు ఇన్వెస్ట్ చేశారట.

లగ్జరీ కార్లు - లగ్జరీ కార్లు కలెక్ట్ చేసే హాబీ ఉన్న కమల్ హాసన్ గ్యారేజ్‌లో Lexus LX 570 ఉంది. ఈ హై-ఎండ్ కార్ ఖరీదు రూ.2.82 కోట్ల వరకూ ఉండొచ్చట. మరో ఖరీదైన కారు BMW 730LD కూడా ఉందట. దీని విలువ దాదాపు రూ.1.35 కోట్ల వరకు ఉంటుంది.

కాస్ట్లీ వాచ్​లు - కమల్ హాసన్ వాచ్​లను ఎక్కువగా కలెక్ట్ చేస్తుంటారట. వాటిల్లో కోరమ్ గోల్డెన్ బ్రిడ్జ్ క్లాసిక్ రోస్ గోల్డ్ వాచ్ ఒకటి. ఇండియన్ మార్కెట్‌లో దీని విలువ రూ.42 లక్షలు. 2022లో కమల్ తన సొంత రోలెక్స్ వాచ్‌ను సూర్యకు గిఫ్ట్‌గా ఇచ్చారు. దాని విలువే రూ.47లక్షలు అని హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది.

రజనీకాంత్‌, కమల్​హాసన్​తో శంకర్​ సినిమాటిక్‌ యూనివర్స్‌! - Indian 2 Director Shankar

కావాలనే నా రెమ్యునరేషన్‌ పెంచా : కమల్‌ హాసన్‌

Kalki 2898 AD Indian 2 Kamalhassan Expensive Things : బాల నటుడి స్థాయి నుంచి విశ్వనటుడిగా ఎదిగిన కమల్ హాసన్ ఇండియన్ సినిమాకే ఒక వరం. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ తన కెరీర్‌లో 230కి పైగా సినిమాలు చేశారు. తమిళం, మలయాళం, హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ సినిమాల్లో నటించి మెప్పించారు. నాలుగు సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్న కమల్ మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.

రీసెంట్‌గా ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ADలో నటించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణెతో కలిసి నటించారు. మరికొద్ది రోజుల్లో అంటే జులై 12న రానున్న ఇండియన్-2లోనూ కథానాయకుడిగా కనిపించనున్నారు.

అయితే కొన్ని ఇంగ్లీష్ మీడియా కథనాలు ప్రకారం కమల్ హాసన్ ఆస్తులు దాదాపు రూ.450కోట్లకు పైమాటే! సినిమాలకు తీసుకునే రెమ్యూనరేషన్‌తో పాటు తమిళ బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ నిర్మాతగా, కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ డబ్బు ఆర్జిస్తున్నారు కమల్. ఇండియన్-2 సినిమాకైతే ఏకంగా రూ.150 కోట్ల వరకు డిమాండ్ చేసి చెక్ అందుకున్నారట. తమిళ బిగ్ బాస్ -7కు హోస్ట్‌గా వ్యవహరించేందుకు రూ.130 కోట్లు అడిగారట.

కమల్ హాసన్ ఖరీదైన విలాసవంతమైన ప్రోపర్టీలు ఇవేకోట్లు విలువ చేసే బంగ్లా - 2021లో కమల్ హాసన్ ప్రభుత్వానికి తన దగ్గర రూ.131 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెలిపారట. 17.79 కోట్లు విలువ చేసే 35.59 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.19.5 కోట్లు విలువ చేసే రెండు లగ్జరీ ప్లాట్లు కూడా ఉన్నాయి.

అలానే చెన్నైలో రూ.92.05 కోట్ల విలువ చేసే బంగ్లా కూడా ఉందట!

లండన్‌లో లగ్జరీ ఇల్లు - కమల్ హాసన్​తో పాటు ఆయన కుటుంబం లండన్‌కు తరచూ వెళ్తుంటారు. వెళ్లిన ప్రతిసారి అక్కడే ఉండేందుకు ఓ మ్యాన్షన్​ను కొనుగోలు చేశారు. దానిపై రూ.2.5కోట్లు ఇన్వెస్ట్ చేశారట.

లగ్జరీ కార్లు - లగ్జరీ కార్లు కలెక్ట్ చేసే హాబీ ఉన్న కమల్ హాసన్ గ్యారేజ్‌లో Lexus LX 570 ఉంది. ఈ హై-ఎండ్ కార్ ఖరీదు రూ.2.82 కోట్ల వరకూ ఉండొచ్చట. మరో ఖరీదైన కారు BMW 730LD కూడా ఉందట. దీని విలువ దాదాపు రూ.1.35 కోట్ల వరకు ఉంటుంది.

కాస్ట్లీ వాచ్​లు - కమల్ హాసన్ వాచ్​లను ఎక్కువగా కలెక్ట్ చేస్తుంటారట. వాటిల్లో కోరమ్ గోల్డెన్ బ్రిడ్జ్ క్లాసిక్ రోస్ గోల్డ్ వాచ్ ఒకటి. ఇండియన్ మార్కెట్‌లో దీని విలువ రూ.42 లక్షలు. 2022లో కమల్ తన సొంత రోలెక్స్ వాచ్‌ను సూర్యకు గిఫ్ట్‌గా ఇచ్చారు. దాని విలువే రూ.47లక్షలు అని హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది.

రజనీకాంత్‌, కమల్​హాసన్​తో శంకర్​ సినిమాటిక్‌ యూనివర్స్‌! - Indian 2 Director Shankar

కావాలనే నా రెమ్యునరేషన్‌ పెంచా : కమల్‌ హాసన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.