ETV Bharat / entertainment

ఒకప్పుడు రూ.90 కోట్ల అప్పులు! - ఇప్పుడు 'కల్కి'తో హాట్​టాపిక్​గా మారిన నటుడెవరంటే? - Kalki 2898 AD Movie

సినీ ప్రపంచంలో ఎంతో మంది నటీనటులు ఒడుదొడుకులు ఎదుర్కోవడం సహజం. కొన్ని సందర్భాల్లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న స్టార్స్​ ఒక్కసారిగా డౌన్​ఫాల్​ అయిపోతుంటారు. ఆర్థికంగానూ గట్టిగా దెబ్బతింటుంటారు. అలా ఒకప్పుడు రూ.90కోట్లతో అప్పుల్లో కూరుకుపోయిన నటుడు మళ్లీ నేలకొట్టిన బంతిలా అంతే వేగంతో పైకి వచ్చి మరిన్ని విజయాలు సాధించారు. ప్రస్తుతం కల్కి చిత్రంతో మరింత ఫేమ్​ను అందుకుని టాక్​ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఇంతకీ ఆయన ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 5:17 PM IST

source ETV Bharat
kalki 2898 AD (source ETV Bharat)

Kalki 2898 AD Amitabh Bachan : రంగుల ప్రపంచంలో కీర్తి, విజయాలు సాధించడం అనుకున్నంత సులువు కాదు. ఎంతో శ్రమ పడాలి. ఎన్నో సహించాలి. అంతలా కష్టపడ్డాక కూడా విజయం దక్కుతుందనే గ్యారంటీ ఉండదు. అదృష్టం కూడా కలిసిరావాలి. అలాంటి సినీ రంగంలో తన నటనతో చిత్రపరిశ్రమను ఏలి బాలీవుడ్​లో సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకున్న తొలి నటుడిగా నిలిచారాయన. బాలీవుడ్‌లో అగ్ర స్థానానికి చేరి అక్కడే తిష్ట వేసుకుని కూర్చొన్న ఆయన ఆ తర్వాత ఒక్కసారిగా పాతాళానికి కూడా పడిపోయారు! తన కంపెనీ నష్టాల్లోకి వెళ్లిపోయి అప్పులు తీర్చలేక దివాళ తీసే స్థితికి చేరుకున్నారు! అయినా ఆత్మ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఈ క్లిష్ట సమయాలే ఆయన్ను మరింత దృఢంగా మార్చాయి. దీంతో మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, ధైర్యంగా ఎలా ముందుకు వెళ్లాలో తన జీవితం ద్వారా చాటి చెప్పారు. ఆయన మరెవరో కాదు బాలీవుడ్‌ షెహన్‌ షా అమితాబ్‌ బచ్చన్‌.

ఆయన జీవితమే పాఠశాల(Amitabh Bachan Career) - కల్కి సినిమాలో అశ్వత్థామగా పోరాడినట్లే నిజ జీవితంలోనూ అమితాబ్‌ అద్భుతంగా పోరాటం చేస్తూ ముందుకెళ్లారు. 1969లో సాత్ హిందుస్థానీ చిత్రంతో అమితాబ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే కొన్నేళ్లపాటు అమితాబ్ బచ్చన్‌కు అసలు భారీ విజయమే దక్కలేదు. అయినా ఆయన అపజయాలకు భయపడలేదు. కృషి చేస్తూనే ఉన్నారు. అప్పటికీ ఆయన వయసు 30. అలా పోరాటం చేస్తూనే సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. అయినా 12 చిత్రాలు ఫ్లాప్‌. రెండే చిత్రాలు విజయవంతయ్యాయి. కానీ బిగ్​బీ అలానే పట్టుదలతో ముందుకెళ్లారు. పరిస్థితులు భయపెడుతున్నా అడుగు ముందుకే వేశారు.

ఆ తర్వాత కాలం మారింది. బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా అమితాబ్‌ కీర్తి హిమాలయాల అంత ఎత్తుకు చేరింది. సినిమాల తర్వాత సినిమాలు, హిట్‌లు తర్వాత హిట్‌లు బిగ్​బీ రేంజ్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాయి. అయితే ఈ సినీ ప్రయాణంలో అఖండ జ్యోతిగా వెలిగిపోతున్న అమితాబ్‌కు 1990ల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. అమితాబ్‌ మరో పోరాటం చేయాల్సి వచ్చింది. 1990ల్లో అమితాబ్ బచ్చన్ స్థాపించిన AB కార్పొరేషన్ భారీ నష్టాలను చవిచూసింది. దీంతో బిగ్​బీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. రుణదాతలకు రూ.90 కోట్లు బకాయిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనపై 55 లీగల్​ కేసులు కూడా నమోదు అయ్యాయి. దీంతో అప్పటివరకూ తనకు మిత్రులుగా ఉన్నవారే ఆ సమయంలో తనతో మాట్లాడేందుకు కూడా సంశయించారని అమితాబ్‌ ఓ ఇంటర్వ్యూలోనూ గుర్తు చేసుకున్నారు.

ధీరూభాయ్ సాయం - అంతటి క్లిష్ట సమయాల్లో ధీరూభాయ్ అంబానీ తనకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారని బిగ్‌ బీ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ధీరూభాయ్​ తన చిన్న కుమారుడు అనిల్ అంబానీకి చెక్‌ ఇచ్చి పంపారట. కానీ ఆ సాయాన్ని బిగ్​బీ అంగీకరించలేకపోయారట.

అదే సమయంలో అమితాబ్​తో యశ్ చోప్రా తీసిన మొహబత్తీన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. ఆ ఘన విజయంతో బిగ్‌ బి మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన కౌన్ బనేగా కరోడ్‌పతి అమితాబ్‌ రేంజ్‌ను మళ్లీ ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇకపోతే ఇప్పుడు అమితాబ్- జయాబచ్చన్‌ దంపతుల నెట్ వర్త్​ రూ.1500 కోట్లకుపైనే ఉంటుందని ఇంగ్లీష్​ ఎంటర్​టైనర్​ వెబ్​సైట్​ బాలీవుడ్ లైఫ్​ కథనంలో రాసి ఉంది.

Amitabh Bachan Movies : ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ వృద్దాప్యంలోనూ(81) వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్​తో కలిసి కల్కి 2898ఏడీలోనూ నటించారు. సినిమాలో అశ్వత్థామగా కనిపించి తన లుక్స్, నటనతో మరోసారి బాక్సాఫీస్ ముందు తన పేరు మార్మోగేలా చేశారు.

ఆ రికార్డుకు అడుగు దూరంలో 'కల్కి' - 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

పాప కావాలా? బాబు కావాలా? - రణ్​వీర్ సమాధానమిదే - Deepika Padukone Baby

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.