Hollywood Movies Similar to Kalki 2898 AD Concept : మహాభారతం నాటి సమయం నుంచి కలియుగం చివరి వరకూ మొత్తం 6 వేల సంవత్సరాల కాలాన్ని చూపిస్తూ రూపొందిన సినిమా 'కల్కి 2898 AD'. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్లతో తాను రూపొందించిన ఈ సినిమా గురించి ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"మా సినిమా మహాభారతంతో మొదలుకొని క్రీస్తు శకం 2898 వరకు ఉన్న మధ్య కాలాన్ని ప్రతిబింబిస్తుంది. అప్పుడెలా ఉండబోతుందోనని ఊహించి ఆ ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాం. అదొక ఇండియన్ సినిమాలాగే తీశాం. ఏదో హాలీవుడ్ సినిమా బ్లేడ్ రన్నర్‌లా కాదు." అని వ్యాఖ్యానించారు. దీంతో అభిమానులు ఆ సినిమా గురించి తెగ ఆరా తీశారు. గతంలోనూ 'కల్కి'తో పలు హాలీవుడ్ సినిమాలను పోల్చినప్పటికీ అవేవి నిజం కావంటూ తాజాగా మూవీ రిలీజ్‌తో తేలిపోయింది.
అయితే స్టోరీ లైన్‌లో గంగా నది ఎండిపోవడం, వనరులన్నీ కోల్పోవడం, తాగే నీరు కూడా దొరక్క ఇబ్బందులు పడటం వంటి దుస్థితిని చూపించారు. అదే సమయంలో దుష్పరిపాలనను అంతం చేయాలనే తాపత్రయంతో మరో టీం ఎదురుచూస్తూ ఉంటుంది. వనరులన్నీ దాచేసి ప్రజలను పీడిస్తున్న వారిని అంతం చేయాలనే ఉద్దేశ్యంతో విష్ణు చివరి అవతారమైన కల్కి రాక కోసం పరితపిస్తుంటుంది. ఈ కథతో పాటుగా కాస్త యాక్షన్, హ్యూమర్ కలిపి స్క్రీన్ ప్లే ప్లాన్ చేసుకున్నారు నాగ్ అశ్విన్. సేమ్ టూ సేమ్ ఇలాగే లేకపోయినా దాదాపు ఇదే కథా నేపథ్యంతో మరికొన్ని రూపొందిన హాలీవుడ్ సినిమాల వివరాలు మీకోసం.
డూన్ (నెట్‌ఫ్లిక్స్)
ఈ సినిమాలో తమను, తమ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఒక గ్రహం నుంచి కాపాడుకునేందుకు హీరో ప్రయత్నిస్తుంటాడు. అతడ్ని టార్గెట్ చేస్తూ ప్రతి కదలికను గమనించిన విలన్ టీమ్, బెదిరింపులకు దిగినా తలొగ్గక పోరాడి విజయం సాధిస్తాడు.
ది మ్యాట్రిక్స్ (నెట్‌ఫ్లిక్స్)
తమకు తెలియకుండానే మనుషులంతా ట్రాపింగ్‌కు గురవుతుంటారు. మెషీన్లు వారిని శాసిస్తూ బానిసలుగా మార్చి ఎనర్జీ సోర్స్ గా వినియోగించుకుంటూ ఉంటాయి. దీని నుంచి మనుషులను కాపాడేందుకు ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ పూనుకి మెషీన్లపై విజయం సాధిస్తాడు.
మ్యాడ్ మ్యాక్స్ : ఫర్రీ రోడ్ (నెట్‌ఫ్లిక్స్)
మంచి కోసం పోరాడే ఒక టీమ్ తమ వారిని కాడాపే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతారు. అందులో మిగిలిన ఒకే ఒక్క మహిళ ఎవరి సహాయం అందకపోయినా ఎడారి వంటి ప్రాంతంలో పోరాడుతూ శత్రుమూకను చిత్తు చేస్తుంది.
బ్లేడ్ రన్నర్ 2049 ( నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్)
దుష్పరిపాలన ప్రభావంతో వనరులు కోల్పోయి కరువు ఎదుర్కొంటుంటారు. దీనికి కారణమైన వారిని తుద ముట్టించే ప్రయత్నమే ఈ మిషన్. ఈ సినిమాకు కల్కి 2898 AD సినిమాకు చాలా పోలికలు కనిపిస్తాయి.
వీ ఫర్ వెండెట్టా (అమెజాన్ ప్రైమ్)
భవిష్యత్‌లో బ్రిటన్ ఎంత ప్రమాదకరంగా మారబోతుందో చూపించిన సినిమా ఇది. మనుషుల ప్రతి కదలికను ప్రభుత్వం మానిటర్ చేస్తూ టార్చర్ పెడుతుంటుంది. ప్రజలను నానా ఇబ్బందుల పెడుతున్న అధికారులకు బుద్ధి చెప్పేలా హీరోయిన్ తో కలిసి పోరాడతాడు హీరో.
'కల్కి' బ్రేక్ చేసిన రికార్డులివే - ఇంతకీ అవి ఏంటంటే? - Kalki 2898 AD Movie Records