Jr NTR Prashanth Neel Movie : 'ఆర్ఆర్ఆర్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దేవర, వార్ 2 ఇలా ఈయన లైనప్ కూడా క్రేజీగా ఉండటం వల్ల అభిమానులు తన అప్‌కమింగ్ మూవీస్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన దేవరతో పాటు వార్ షూటింగ్లో సందడి చేస్తున్నారు. రెండింటికీ తన కాల్షీట్స్ను అడ్జెస్ట్ చేసుకుని బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా, తారక్ తన 31వ సినిమా గురించి గతంలోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న చిత్రంలో ఆయన నటించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి నెట్టింట మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. అదేంటంటే త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందట.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట. ఇందులో భాగంగా మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. తారక్ ప్రస్తుతం వరుస షూటింగుల్లో బిజీగా ఉన్నందున ఆ చిత్రీకరణ పూర్తయ్యాకనే ఎన్టీఆర్ 31 సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమచారం.
ఇక దేవర విషయానికి వస్తే, సముద్రం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని చిత్ర బృందం ముందే ప్రకటించింది. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రూ.120 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఎన్టీఆర్ బర్త్‌డే - 'దేవర'తో పాటు ఆ రెండు చిత్రాల అప్డేట్స్ కూడా! - Jr NTR Devara Movie
స్టార్ కపుల్స్ డిన్నర్ డేట్ - బీటౌన్‌లో ఎన్టీఆర్, ప్రణతి సందడి - Jr NTR Dinner Date