Jr NTR Injury Update : టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలయ్యాయంటూ వస్తున్న వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. ఆయన సురక్షితంగా ఉన్నారని.. చేతికి స్వల్ప గాయమైనట్లు స్పష్టం చేసింది. మంగళవారం రాత్రే దేవర షూటింగ్ పూర్తి చేశారని వివరిస్తూ తారక్ కార్యాలయం సిబ్బంది ప్రకటన విడుదల చేశారు. ఇటీవలె జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఎడమ చేతి మణికట్టుకు స్వల్వ గాయమైందని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు ఎన్టీఆర్ టీమ్. మణికట్టు గాయంతోనే ఎన్టీఆర్.. దేవర చిత్రీకరణను పూర్తి చేశారని చెప్పారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. మణికట్టు గాయం కారణంగా రెండు వారాలపాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటారని వివరించారు.
Official press Note From Team :pray:@tarak9999 #Devara pic.twitter.com/lDSk52417w
— Jr NTR Fan Club (@JrNTRFC) August 14, 2024
ప్రస్తుతం ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవరలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రమాదం జరిగి.. గాయాలయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఆయన రోడ్డు ప్రమాదానికి గురై, ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని కార్యాలయ సిబ్బంది విజ్ఞప్తి చేసింది.
ఎన్టీఆర్ షూటింగ్ కంప్లీట్
కాగా అంతకుముందే 'దేవర పార్ట్- 1'లో తన షూటింగ్ చివరి షాట్ తాజాగా పూర్తయిందని ఎన్టీఆర్ ప్రకటించారు. దేవర టీమ్‌తో జర్నీ అద్భుతంగా సాగిందని, టీమ్ అందరినీ మిస్ అవుతున్నానని తెలిపారు. ఈ మేరకు షూటింగ్ స్పాట్‌లోని ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'దేవర పార్ట్ 1లో నా చివరి షాట్ పూర్తైంది. ఇదో అద్భుతమైన ప్రయాణం. నేను ఈ సముద్రమంత ప్రేమను, అద్భుతమైన బృందాన్ని మిస్ అవుతాను. సెప్టెంబర్ 27న విడుదల దాకా వేచి ఉండలేకపోతున్నా' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా దేవరను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో తారక్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. కాగా, ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా 'చుట్టమల్లె' సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ పాటలో ఎన్టీఆర్- జాన్వీ జోడీ ఆకట్టుకునేలా కనిపించింది.
'దేవర' సాలిడ్ అప్డేట్- వాళ్లను మిస్ అవుతానంటూ ఎన్టీఆర్ పోస్ట్! - NTR Devara
దేవర వీడియో సాంగ్‌కు యమదొంగ ఆడియో - సింక్ భలే సెట్ అయింది! - Devara Chuttamalle Song