ETV Bharat / entertainment

'దేవర' మేనియా - ఓవర్సీస్​ ప్రీ సేల్‌లో ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయంటే? - Jr NTR Devara Movie - JR NTR DEVARA MOVIE

Jr NTR Devara Movie : జూనియర్ ఎన్​టీఆర్ 'దేవర' మూవీ ప్రస్తుతం ఓవర్సీస్​లో జోరు చూపిస్తోంది. ఆ వివరాలు మీ కోసం.

Jr NTR Devara Movie
Jr NTR (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 4:05 PM IST

Jr NTR Devara Movie : మ్యాన్​ ఆఫ్ మాసెస్​ జూనియర్ ఎన్​టీఆర్, డైరెక్టర్​ కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ కోసం టాలీవుడ్​తో పాటు అన్ని భాషల ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పాటలు నెట్టింట రికార్డు స్థాయిలో వ్యూవ్స్ సాధించి ట్రెండ్ అవుతోంది. టీజర్ కూడా ఈ చిత్రంపై భారీగానే అంచనాలు పెంచేశాయి. ట్రైలర్​ కూడా సెప్టెంబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్​గానూ కన్ఫార్మ్ అయ్యింది.

అయితే తాజాగా ఈ మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తన జోరు చూపించింది. తాజా నివేదికల ప్రకారం 'దేవర' మూవీ కోసం 5 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇది చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఓవర్సీస్​లోనే ఈ రేంజ్​లో హవా ఉందంటే, ఇక మన దగ్గరకి వస్తే తగ్గేదేలే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

6 నిమిషాల్లోనే
దేవర సినిమా వరల్డ్ వైడ్​గా విడుదలయ్యేందుకు ఇంకా 25 రోజులుంది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుతున్న దేవర సినిమా ప్రీ సేల్స్‌, సోమవారం కెనడాలో 25 స్క్రీన్లలో గ్రాండ్‌గా మొదలయ్యాయి. ప్రీ సేల్స్‌ మొదలైన 6 నిమిషాల్లోనే గ్రేటర్‌ టొరంటో ఏరియాలోని లీడింగ్ మల్లీప్లెక్స్‌ చైన్ మార్కెట్‌లో ఉన్న యార్క్‌ సినిమాస్‌, వుడ్‌ సైడ్‌ స్క్వేర్ సినిమాస్‌, అల్బియాన్‌ సినిమాస్‌, సెంట్రల్‌ పార్క్‌ వే సినిమాస్‌ స్క్రీన్లపై ఫాస్ట్ ఫిల్లింగ్‌ బోర్డ్సు్ దర్శనమిస్తున్నాయని తెలుస్తోంది. దీంతో తారక్‌ హీరోగా తెరకెక్కిన 'దేవర' సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా క్రేజ్ ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలు. ఈ క్రమంలో 'దేవర' ప్రీమియర్లలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా కొరటాల శివ దేవరను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను జూనియర్ ఎన్​టీఆర్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. అలాగే చిత్రానికి యంగ్ టాలెంట్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలో తారక్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు.

ఆకట్టుకున్న సాంగ్స్
కాగా, ఇప్పటికే దేవర నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ పాటలో ఎన్​టీఆర్ - జాన్వీ జోడీ ఆకట్టుకునేలా కనిపించింది. మెలోడియస్ సాగిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్​ను ఒక ట్రాన్స్​లోకి తీసుకెళ్లింది.

దేవర మూడో సాంగ్ రిలీజ్- ఎన్టీఆర్, జాన్వీ ఎనర్జిటిక్ స్టెప్పులు చూశారా! - Devara Songs

'దావూదీ' జాన్వీ డ్యాన్స్ - హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌ అయిన మూడో రోజుల్లోనే షూటింగ్​! - Janhvi Kapoor Devara

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.