Mr And Mrs Mahi Review :
చిత్రం : మిస్టర్ అండ్ మిసెస్ మహి;
నటీనటులు: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్, రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా తదితరులు;
సినిమాటోగ్రఫీ : అనయ్ గోస్వామి;
ఎడిటింగ్ : నితిన్ బైది;
రచన: నిఖిల్ మల్హోత్ర, శరణ్ శర్మ;
నిర్మాత : కరణ్ జోహార్, జీ స్టూడియోస్;
దర్శకత్వం : శరణ్ శర్మ
స్సోర్ట్స్ డ్రామాలను తెరకెక్కించడంలో బాలీవుడ్‌కు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. హాకీ నుంచి కుస్తీ వరకు పలు రకాల క్రీడల్ని వారు తెరకెక్కిస్తుంటారు. ఈ మధ్యే అజయ్ దేవగణ్ మైదాన్ వచ్చి హిట్ అవ్వగా ఇప్పుడు క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో మిస్టర్ అండ్ మిసెస్ మహి వచ్చింది. రాజ్ కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా నటించారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?
కథేంటంటే ? మహేంద్ర (రాజ్ కుమార్ రావ్) ఓ గొప్ప క్రికెటర్ అవ్వాలన్నది కల. కానీ అతడు ఓ ఫెయిల్యూర్ క్రికెటర్. అయితే అతడి తండ్రి బలవంతంగా తన స్పోర్ట్స్ షాప్ నిర్వహణ బాధ్యతల్ని మహేంద్రకు అప్పగిస్తాడు. అలానే వైద్యురాలైన మహిమ అగర్వాల్ (జాన్వీ కపూర్)తో పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత తన ఫెయిల్యూర్ స్టోరీని భార్య మహిమకు చెబుతాడు. అయితే మహిమకు కూడా క్రికెట్ అంటే పిచ్చి. దీంతో మహేంద్ర తన భార్యను క్రికెటర్ చేసేందుకు కష్టపడతాడు. కోచ్‌గా మారతాడు. మరి చివరికి తమ క్రికెట్ కలలను ఆ జంట ఎలా నేరవేర్చుకున్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే ? ఈ చిత్రం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగడం మైనస్. కొన్ని సన్నివేశాలు కథకు అతకలేదు. హీరో, హీరోయిన్ల నేపథ్యం, పెళ్లి ప్రయాణం వరకూ సినిమా ఆకట్టుకున్నా ఆ తర్వాత కథ సాదాసీదాగా మారిపోయింది. కథ, కథనాల కన్నా జాన్వీకపూర్, రాజ్‌కుమార్ రావ్ నటనే సినిమాను కాస్త నిలబెట్టింది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాల్లో క్రికెట్ మ్యాచ్‌ను చూపిస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఉత్కంఠతకు గురయ్యేలా సన్నివేశాలు లేవు. రచనలోనే చాలా లోపాలు కనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే ? రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జోడీ బాగుంది. ఇద్దరూ తమ పాత్రల్లో సహజంగా ఒదిగిపోయారు. కోచ్ బెన్నీగా రాజేశ్ శర్మ, మహేంద్ర తల్లిగా జరీనా వహాబ్, తండ్రిగా కుముద్ మిశ్రా నటన బాగుంది. టెక్నికల్‌గా సినిమా ఉన్నతంగానే ఉంది. అనయ్ గోస్వామి కెమెరా వర్క్ కూడా బాగుంది. సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. జాన్ స్టీవార్డ్ ఏడూరి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ప్రభావం చూపించింది. నిఖిల్ మల్హోత్ర, దర్శకుడు శరణ్ శర్మ స్క్రిప్ట్ వర్క్ చేశారు. అయితే రచన పరంగా ఇంకా వైవిధ్యత చూపించాల్సింది. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టే ఉంది. ఫైనల్‌గా మిస్టర్ అండ్ మిసెస్ మహి మజా లేని ఓ క్రికెట్ మ్యాచ్.
బుజ్జి, భైరవ యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందంటే? - Prabhas Kalki 2898 AD
చేసిన ఐదు సినిమాలు ప్లాప్ - కానీ నయన్, తమన్నా కన్నా ఈమెకే క్రేజ్ ఎక్కువ! - Most popular Heroine