Jagapathi Babu Birthday Post : 90స్లో ఫ్యామిలీ హీరోగా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు స్టార్ హీరో జగపతిబాబు. తన నటనతో అభిమానులను ఎమోషనల్ చేసిన ఈ స్టార్ ఇప్పుడు పవర్ఫుల్ విలన్‌గా కనిపిస్తూ తనలోని కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. అంతే కాకుండా అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇప్పటి యూత్‌కు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా నటిస్తున్నారు. తాజాగా ఆయన 63వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్‌కు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుంచి విషెస్ వెల్లువ మొదలైంది.
అయితే జగపతిబాబు కూడా తన ఫ్యాన్స్ కోసం ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆయన చేతిలో రెండు బాటిళ్లు పట్టుకుని ఉన్నారు. అందులో ఒకటి పాలు, ఇంకొంటి మద్యం సీసా. అయితే జగపతి బాబు 'ఇందులో నన్ను ఏది తాగమంటారు' అంటూ ఫ్యాన్స్‌ను సరదాగా అడిగారు.
"ఎలాగోలా పుట్టేశాను. సిగ్గు లేకుండా అడుగుతున్న, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. రెండోది ఎక్కువసేపు ఆలోచించకుండా తొందరగా డిసైడ్ చేయండి. ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు" అంటూ బాటిళ్లతో దిగిన ఓ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఒక్క సెకన్ షాకైనప్పటికీ, ఆయన హ్యూమర్‌ను అర్థం చేసుకుని కాసేపు నవ్వుకున్నారు. ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్తున్నారు.
ఇక జగ్గు భాయ్ కెరీర్ విషయానికి వస్తే- 'మంచి మనుషులు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన ఆయన, ఆ తర్వాత 198లో వచ్చిన 'సింహ స్వప్నం'తో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'శుభలగ్నం', 'శుభలగ్నం', 'శుభాకాంక్షలు','మావిడాకులు','పెళ్లి పీటలు' తదితర చిత్రల్లో తనదైన స్టైల్లో నటించి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు.
మరోవైపు 'గాయం','మనోహరం' లాంటి యాక్షన్ సినిమాల్లో నటించి తనలోని యాక్షన్ హీరోను చూపించారు. స్టార్ హీరోగా ఎన్ని సినిమాల్లో మెరిసిన ఆయన, బాలకృష్ణ హీరోగా రూపొందిన లెజెండ్ సినిమాతో విలన్‌గా తన సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీ అయ్యారు. 'శ్రీమంతుడు', 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం', 'మహర్షి', 'అఖండ', 'సలార్' లాంటి హిట్ చిత్రాల్లోనూ ఆయన నటించారు.
-
Elagola Putteysanu. siggu lekunda adugutuna, mee andari ashishulu naku kaavali.. Rendodhi, alochinchakunda quick ga decide cheyandi ee renditlo edhi kotamantaru? pic.twitter.com/k8FaHEq4KG
— Jaggu Bhai (@IamJagguBhai) February 12, 2024