Tollywood Industry Hits heroes : ఇండస్ట్రీకి ఎప్పుడొచ్చామా అని కాదు, ఎన్ని హిట్లు కొట్టాము అనేదే ఇక్కడ విషయం. మనం అభిమానిస్తున్న చాలా మంది పెద్ద హీరోలు వందల సంఖ్యల్లో సినిమాల్లో నటించారు. కానీ వాటిలో ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న సినిమాలు అతి చిన్న సంఖ్యలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అవును టాలీవుడ్ టాప్ హీరోస్ అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి చిరంజీవి, మహేశ్ బాబు వరకు చాలా మంది పెద్ద హీరోల ఖాతాలో ఇండస్ట్రీ హిట్లు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. మరి టాలీవుడ్లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న హీరోలు ఎవరు? వారిలో టాప్ స్థానంలో ఉన్న వారెవరో ఇప్పుడు మనం చూద్దాం.
చిరంజీవి(Chiranjeevi Industry Hit movies) - మెగా స్టార్ చిరంజీవి ఇప్పటి వరకూ 150కిపైగా చిత్రాల్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఎన్ని ఇండస్ట్రీ హిట్లు కొట్టారో తెలుసా ఎనిమిది. అవును మన చిరు ఇప్పటి వరకూ ఎనిమిది ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అవేంటంటే.
1. ఖైదీ
2. పసివాడి ప్రాణం
3. యముడికి మొగుడు
4. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
5. జగదేక వీరుడు అతిలోక సుందరి
6. గ్యాంగ్ లీడర్
7. ఘరానా మొగుడు
8. ఇంద్ర
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- అక్కినేని నాగేశ్వర రావు - చిరంజీవి తర్వాత దివంగత సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరావు ఖాతాలో ఆరు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.
1. బాలరాజు
2. దేవదాసు
3. రోజులుమారాయి
4. మాయాబజార్
5. దసరా బుల్లోడు
6. ప్రేమాభిషేకం - సీనియర్ ఎన్టీఆర్
తెలుగు సినిమా వైభవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన సీనియర్ ఎన్టీఆర్ గారి ఖాతాలో పాతాళ బైరవి, మాయాబజార్, లవ కుశ, అడవి రాముడు సహా పలు చిత్రాలు ఉన్నాయట.
కృష్ణ ఖాతాలో అల్లూరి సీతారామరాజుతో పాటు మరి కొన్ని ఉన్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ ఖాతాలో ముద్దుల మావయ్య, సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు ఉండగా - పవన్ కల్యాణ్ ఖాతాలో ఖుషీ, అత్తారింటికి దారేది ఉన్నాయి. మహేశ్ బాబుకు పోకిరి, రామ్ చరణ్‌కు మగధీర, ప్రభాస్‌కు బాహుబలి- 2 ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- రజనీకాంత్ - అన్ని భాషల్లో కలిపి 160కిపైగా చిత్రాల్లో నటించిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండియావైడ్‌గా అందరి కన్నా ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు తన ఖాతాలో వేసుకుని టాప్‌లో నిలిచారు. ఇప్పటి వరకూ ఆయన నటించిన సినిమాల్లో 15 చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అవేంటంటే.
1. పదహారు వయదినిలే
2. మురత్తు కాలై
3. పదిక్కతవన్
4. మనితర్
5. దళపతి
6. మన్నన్
7. అన్నమలై
8. భాషా
9. పెద రాయుడు
10. నరసింహ
11. చంద్రముఖి
12. శివాజీ
13. రోబో
14. కబాలీ
15. 2.0
- రాజ్ కుమార్
కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ తన ఖాతాలో ఇప్పటి వరకూ 14 ఇండస్ట్రీ హిట్లు వేసుకున్నారు.
1. బేడర కణ్ణప్ప
2. భక్త విజయ
3. భూకైలాస
4. సత్య హరిశ్చంద్ర
5. కస్తూరి నివాస
6. బంగారు మనుష్య
7. సంపత్తిగె సవాల్
8. మయూర
9. బబ్రువాహన
10. సనాది అప్పన్న
11. శంకర్ గారు
12. కవిరత్న కాళిదాస
13. అనురాగ అరళితు
14. జీవన చైత్ర
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- కమల్ హాసన్
రజనీకాంత్, రాజ్ కుమార్ల తర్వాత ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోల్లో కమల్ హాసన్ ఉన్నారు. ఈయన ఇప్పటి వరకూ నటించిన సినిమాల్లో 13 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి.
1.పదహారు వయదినిలే
2.కోకిల
3. మరో చరిత్ర
4.మదనోత్సవం
5. ఎర్ర గులాబీలు
6.ఏక్ దుజే కేలియే
7. సకల కళా వల్లవన్
8.తూంగతే తంబి తూంగతేయ్
9.విచిత్ర సోదరులు
10.క్షత్రియ పుత్రుడు
11.భారతీయుడు
12. దశావతారం
13. విక్రమ్
*మమ్ముట్టి
వీళ్ల తర్వాత మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తన ఖాతాలో 12 సినిమాలను ఇండస్ట్రీ హిట్లను వేసుకున్నారు.
1. సందర్భం
2. యాత్ర
3. ఆవనాజి
4. న్యూఢిల్లీ
5. ఒరు సీబీఐ డైరీ కురిప్పు
6. ఎ నార్తర్న్ స్టోరీ ఆఫ్ శౌర్యం
7. పప్పాయుడే సొంతం అప్పూస్
8. ది కింగ్
9.హిట్లర్
10. రాజమాణిక్యం
11.20-20
12. కేరళ వర్మ పజాస్సి రాజా
- మోహన్ లాల్
మలయాళ ఫేమస్ హీరోల్లో ఒకరైన మోహన్ లాల్ ఇప్పటి వరకూ ఆయన 10 ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకున్నారు.
1. ఇరుపాథమ్ నూత్తందు
2. చిత్రం
3. కిలుక్కమ్
4. మణిచిత్రతాఝూ
5. నరసింహం
6. ట్వంటీ-20
7. కేరళ వర్మ పఝాస్సీ రాజా
8. దృశ్యం
9. పులిమురుగన్
10. లూసిఫర్
బంపర్ ఆఫర్ : ప్రభాస్ ఐకానిక్ బైక్ మీ సొంతమవ్వాలా? ఇలా చేస్తే చాలు! - salaar Bike
'కమల్ హాసన్ వల్ల ఆర్ధికంగా ఇబ్బంది పడ్డాను' - ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్! - KAMAL HASSAN