ETV Bharat / entertainment

పాటకు రూ. 50లక్షలు! - అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కొరియోగ్రాఫర్ ఎవరంటే ? - ఫరా ఖాన్​ రెమ్యూనరేషన్​

Indias Highest Paid Choreographer : ఎలాంటి జానర్ సినిమాలైనా అందులో సాంగ్స్​ కీలకంగా ఉంటాయి. వాటికి తగ్గట్లుగా స్టెప్పులు డిజైన్​ చేయడంలో కొరియోగ్రాఫర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఇక పెరుగుతున్న డిమాండ్​ కొద్ది వారు కూడా అందుకు తగ్గట్లుగా రెమ్యూనరేషన్​ అందుకుంటున్నారు. అయితే ఇండియన్ ఫిల్మ్​ హిస్టరీలో ఇప్పటివరకు ఓ కొరియోగ్రాఫర్​ అత్యథిక రెమ్యూనరేషన్​ అందుకుని రికార్డుకెక్కారు. ఆ విశేషాలు మీ కోసం

Indias Highest Paid Choreographer
Indias Highest Paid Choreographer
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 2:35 PM IST

Updated : Jan 23, 2024, 3:44 PM IST

Indias Highest Paid Choreographer : భారతీయ సినిమాల్లో కథకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందులో పాటలకు అంతే ఇంపార్టెన్స్ ఉంది. కొన్ని సార్లు సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయినా అందులోని పాటలకు అందరూ కనెక్ట్ అవుతుంటారు. టైటిల్ సాంగ్, రొమాంటిక్​ సాంగ్​, స్పెషల్ సాంగ్​ ఇలా కథకు తగ్గట్లుగా సినిమాలో సాంగ్స్​ను మేకర్స్​ ప్లాన్​ చేస్తుంటారు. అయితే కొన్ని పాటలకు కేవలం హావభావాలు సరిపోతాయి. కానీ కొన్నింటికి మాత్రం డ్యాన్స్​ కావాల్సి ఉంటుంది. పాటకు మంచి స్టెప్పులు జోడిస్తే ఇక అది బ్లాక్​బస్టర్​ సాంగ్​గా మారుతుంది. ఇటీవలే విడుదలైన నాటు నాటు సాంగ్​ దీనికి సరైన ఉదాహరణ. ఈ పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో దాని స్టెప్పులు కూడా అదే రేంజ్​లో పాపులారిటి సాధించింది.

ఎలాగైతే పాటకు ప్రాణం పోసేందుకు మ్యూజిక్​ డైరెక్టర్లు ఉంటారో అలాగే డ్యాన్స్​ను తీర్చిదిద్దేందుకు కొరియోగ్రాఫర్లు ఎంతో శ్రమిస్తుంటారు. పాటలకు తగ్గట్లుగా డ్యాన్స్​ కొరియోగ్రాఫ్​ చేయటం దగ్గర నుంచి హుక్​ స్టెప్స్​ క్రియేట్​ చేసేంత వరకు తమ కళను ఉపయోగిస్తుంటారు. అలా ఆడియెన్స్​ను ఉర్రూతలూగించేలా స్టెప్పులు క్రియేట్​ చేసి పాపులర్ అవుతుంటారు. అలా కొరియోగ్రాఫ్​ చేసే వారకి కూడా ఫుల్​ డిమాండ్ ఉంది. దీంతో రోజు రోజుకూ వారి పారితోషకం కూడా ఇంతకింత పెరుగుతోంది. అయితే ఇండియాలో భారీ రెమ్యూనరేషన్ తీసుకుని రికార్డుకెక్కిన కొరియోగ్రాఫర్​ ఒకరు ఉన్నారు.

ఆమెవరో కాదు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ టాప్​ కొరియోగ్రాఫర్​ కొనసాగుతున్న ఫరా ఖాన్. ఓ కొరియోగ్రాఫర్​గా, ఓ డైరెక్టర్​గా ఆమె బీటౌన్​కు ఎన్నో సూపర్ హిట్​ సినిమాలను అందించారు. స్వతహాగా డ్యాన్సర్ అయిన ఫరా అనతికాలంలోనే స్టార్ కొరియోగ్రాఫర్​గా ఎదిగారు. ఆ తర్వాత డైరెక్టర్​గా, నిర్మాతగానూ రాణించారు. 'మై హూన్ నా', 'తీస్ మార్ ఖాన్', 'హ్యాపీ న్యూ ఇయర్' వంటి హిట్ చిత్రాలను రూపొందిచారు. అయితే ఆమె ఒక్కోపాటకు రూ.50 లక్షలు తీసుకుంటారని సమాచారం. ఫిల్మ్ మేకర్ అయినప్పటికీ కొరియోగ్రఫీని వదలని ఫరా తాజాగా షారుక్ ఖాన్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'జవాన్' సినిమాకు డ్యాన్స్​ కొరియోగ్రాఫర్​గా పనిచేశారు.

Last Updated : Jan 23, 2024, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.