Indian Movies Nominated And Won Oscar : ఆస్కార్స్‌లో భారతదేశ సినిమా ప్రయాణం చాలా అద్భుతమైంది. అస్కార్ బరిలో ఇప్పటివరకు మన దేశం నుంచి కేవలం 20 సార్లు నామినేషన్స్ వెళ్లగా అందులో 10 సార్లు మాత్రమే అస్కార్‌ను అందుకున్నాం. మన దేశం నుంచి తొలిసారి ఆస్కార్ అవార్డుల బరిలో మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన 'మదర్ ఇండియా' సినిమా నిలిచింది. ఈ సినిమాలో నర్గీస్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. అయితే 'మదర్ ఇండియా' తర్వాత ఆస్కార్‌కు మరో భారత చిత్రం నామినేట్ కావడానికి చాలా కాలం పట్టింది. 'నైట్స్ ఆఫ్ కాబిరియా' సినిమాకు ఆస్కార్ తృటిలో తప్పింది.
'గాంధీ'కి 8 ఆస్కార్లు
1982లో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహ నిర్మాతగా ఇంగ్లిష్ దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో తెరకెక్కించిన సినిమా 'గాంధీ'. భారతీయ చలనచిత్ర రంగంలో ఇదో కీలక ఘట్టం. 55వ ఆస్కార్ అకాడమీ అవార్డుల్లో 11 సార్లు ఆస్కార్‌కు నామినేటైన ఈ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్తంతో పాటు 8 పురస్కారాలను గెలుచుకుంది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా భాను అతియా అవార్డును గెలుచుకున్నారు. కాగా, ఆస్కార్ అందుకున్న తొలి భారతీయురాలిగా ఈమె చరిత్ర సృష్టించారు.
ఇక 95వ అకాడమీ అవార్డుల్లో విభిన్న కథలతో తెరకెక్కిన మూడు భారతీయ సినిమాలు ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇది భారతీయ సినిమా రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అప్పటివరకు ఆస్కార్‌ను అందని ద్రాక్షలా భావించిన భారతీయ చిత్ర పరిశ్రమ ఈ సినిమాలతో ప్రతిష్ఠాత్మక అస్కార్ అవార్డులను ఒడిసిపట్టుకుంది. వాటిలో ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ఆర్ఆర్ఆర్' (తెలుగు) విజయం సాధించగా, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో విజయం సాధించింది. కాగా, ఈ విజయాలు ఆస్కార్స్ చరిత్రలో భారతీయ సినిమాకి ఎంతో చారిత్రాత్మకమైన జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి.
ఆస్కార్‌కు నామినేట్ అయి అవార్డు అందుకున్న చిత్రాలివే
- మదర్ ఇండియా (1958) : ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది.
- ఇస్మాయిల్ మర్చంట్ (1961) : ది క్రియేషన్ ఆఫ్ ఉమెన్ బెస్ట్ షార్ట్ సబ్జెక్ట్ (లైవ్ యాక్షన్) ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది.
- ఫాలి బిలిమోరియా (1969) : ది హౌస్ దట్ ఆనంద బిల్ట్- బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది.
- ఇషు పటేల్ పూస గేమ్ (1978) : ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది.
- కే.కే.కపిల్ (1979) : యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్ బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) ఆస్కార్ పోటీలకు నామినేట్ అయ్యింది.
- భాను అతియా, రవిశంకర్ (1983) : గాంధీ- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచి అవార్డును ముద్దాడింది. భారత తొలి ఆస్కార్ విజేత భాను అతియానే.
- ఇస్మాయిల్ మర్చంట్ (1987) : ఎ రూమ్ విత్ ఎ వ్యూ- బెస్ట్ పిక్చర్ విభాగంలో నామినేట్ అయ్యింది.
- సలామ్ బాంబే (1989) : ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్‌కు ఎంపికైంది.
- ఇస్మాయిల్ మర్చంట్ (1993) : హోవార్డ్స్ ఎండ్ ఉత్తమ చిత్రంగా ఆస్కార్స్‌కు నామినేట్ అయ్యింది.
- ఇస్మాయిల్ మర్చంట్ (1994) : ది రిమైన్స్ ఆఫ్ ది డే ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యింది.
- లగాన్ (2002) : లగాన్- ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్స్ నామినేషన్స్‌లో నిలిచింది.
- అశ్విన్ కుమార్ (2005) : లిటిల్ టెర్రరిస్ట్- బెస్ట్ షార్ట్ సబ్జెక్ట్ (లైవ్ యాక్షన్) అకాడమీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యింది.
- స్లమ్‌డాగ్ మిలియనీర్ (2009) : రెసూల్ పూకుట్టి, గుల్జార్, ఏఆర్ రెహమాన్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది.
- ఏఆర్ రెహమాన్ (2011) : 127 గంటల ఉత్తమ ఒరిజినల్ స్కోర్- ఉత్తమ ఒరిజినల్ పాటకు నామినేట్ అయ్యింది.
- బాంబే జయశ్రీ (2013) : లైఫ్ ఆఫ్ పై- బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు ఎంపికైంది.
- స్మృతి ముంధ్రా (2020) : ఫ సెయింట్ లూయిస్ సూపర్‌మ్యాన్- ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) విభాగంలో ఎంపికైంది.
- రింటు థామస్ సుష్మిత్ ఘోష్ (2022) : ఫైర్‌తో రాయడం- ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌గా నామినేట్ అయ్యింది.
- ఏం.ఏం.కీరవాణి (సంగీతం), చంద్రబోస్ (లిరిక్స్)తో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ (2023) ఆస్కార్‌ను ముద్దాడింది.
- కార్తికి గోన్సాల్వేస్ గునీత్ మోంగా (2023) : ది ఎలిఫెంట్ విస్పరర్స్- బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) కేటగిరీలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ను గెలుచుకుంది.
- షౌనక్ సేన్ అమన్ మన్ (2023) : ఆల్ దట్ బ్రీత్స్- బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది.
- 1992లో 'పురాణ బెంగాలీ' చిత్ర నిర్మాత సత్యజిత్ రేకు గౌరవ అకాడమీ అవార్డు లభించింది. కాగా, ఇప్పటివరకు ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయుడుగా ఈయన చరిత్రలో నిలిచారు.
- రాహుల్ ఠక్కర్, కొట్టాలంగో లియోన్ 2016లో టెక్నికల్ అచీవ్‌మెంట్ కేటగిరీలో అకాడమీ అవార్డును ముద్దాడారు. 2018లో వికాస్ సాథయే కూడా అవార్డు గెలుచుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆస్కార్ 2024: బరిలో పది చిత్రాలు- అయినా ఆ సినిమాకే ఛాన్స్ ఎక్కువ!
OTTలో ప్రతిష్టాత్మక 96వ ఆస్కార్ అవార్డ్స్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?