Indian 3 Release : కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇండియన్ 2' (భారతీయుడు 2) ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. భారీ అంచనాలతో అలాగే బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకుంది. అంతేకాకుండా ఎన్నో విమర్శలను కూడా అందుకుంది. అయితే గతంలోనే మేకర్స్ ఈ చిత్రానికి మూడో పార్ట్ కూడా రానుందంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా దానికి సంబంధించి ఓ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.
అయితే పార్ట్ 2 సమయంలోనే దీని షూటింగ్ కూడా కంప్లీట్ చేశారని సినీ వర్గాల మాట. అప్పటి ప్రమోషన్స్‌లోనే పార్ట్ 3ని ఆరు నెలల గ్యాప్ తర్వాత విడుదల చేస్తామని వెల్లడించారు. కానీ ఇండియన్ సీక్వెల్‌కు వచ్చిన నెగిటివ్ రిజల్ట్స్‌తో ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు మేకర్స్.
మేకర్స్ చెప్పిన ఆరు నెలల సమయం అంటే 2025 జనవరి కల్లా ఈ పార్ట్ 3ని రిలీజ్ చేయాలి. అయితే టైమ్ దగ్గర పడుతున్నకొద్ది 'భారతీయుడు 3' నుంచి ఒక్క అప్డేట్ కూడా రావట్లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభిమానుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న సందిగ్ధంలో పడిపోయారు. అసలు పార్ట్ 3 వస్తుందా రాదా అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు గతంలో ఈ పార్ట్ 3ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తారని కూడా పలు రూమర్స్ నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అయితే వాటిపై కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి మేకర్స్ ఏ మేరకు రెస్పాండ్ అవుతారో చూడాలి.
ఇక కమల్ ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సింబు, త్రిష, అలీ ఫజల్, తదితర స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే 'అమరన్' సినిమాతో ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయ్యారు కమల్. ఆయన ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.
కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్ - 'థగ్ లైఫ్' టీజర్ చూశారా?
'20 ఏళ్ల తర్వాత రోలెక్స్ కోసమే అలా చేశా - కమల్‌హాసన్ అంటే భయమేసింది!' - సూర్య