ETV Bharat / entertainment

గ్రాండ్​గా ఆడియో లాంఛ్​ - 'భారతీయుడు' కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోలు - Indian 2 Audio Launch Guests - INDIAN 2 AUDIO LAUNCH GUESTS

Indian 2 Audio Launch Event : కమల్ హాసన్​, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న 'భారతీయుడు 2' సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ ఆడియో లాంఛ్​కు సంబంధించిన ఓ రూమర్ ఇప్పుడు అభిమానుల నోట నానుతోంది. అదేంటంటే ?

Indian 2 Audio Launch Event
Indian 2 Audio Launch Event
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 4:59 PM IST

Indian 2 Audio Launch Event : లోకనాయకుడు కమల్ హాసన్​, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2' ( ఇండియన్ 2). గత కొంత కాలంగా షూటింగ్​లో ఉన్న ఈ మూవీ, ఎట్టకేలకు ఈ ఏడాది జూన్​లో విడుదలయ్యేందుకు సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కూడా ప్రమోషనల్ ఈవెంట్స్​ను వీలైనంత త్వరగా మొదలెట్టేందుకు ప్లాన్స్ వేస్తున్నారు.

అందులో భాగంగానే త్వరలో గ్రాండ్​గా ఇండియన్ 2 ఆడియో లాంఛ్​ జరగనుందని సమాచారం. సినీ వర్గాల టాక్ ప్రకారం ఈ ఈవెంట్ మే 16న జరగనుందట. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా ఈ ఆడియో లాంఛ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, తాజాగా ఈ ఈవెంట్​కు సంబంధించిన మరో రూమర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ గ్రాండ్ లాంఛ్​కు గ్లోబల్ స్టార్ రామ్​ చరణ్‌ అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై ప్రస్తుతం ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం 'ఈ రూమర్ నిజమైతే ఇక పండగే', 'త్వరగా అఫీషియల్ అనౌన్స్​మెంట్ ఇవ్వండి' అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Kamal Haasan Indian 2 Cast : ఇక భారతీయుడు సినిమాలో కమల్​తో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బ్రహ్మానందం, ఎస్‌జే సూర్య, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, బాబీ సింహా, మధుబాల, కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జేయింట్స్​ బ్యానర్​పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, లైకా సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.ఇటీవలే మేకర్స్‌ షేర్ చేసిన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంది. దీంతో పాటు మూవీ పోస్టర్స్ కూడా అభిమానుల్లో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెంచుతోంది. ఇక ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. కానీ డేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

లిరిసిస్ట్​గా మారిన కమల్ హాసన్- 2గంటల్లోనే రికార్డింగ్ కూడా కంప్లీట్ - Kamal Haasan Thug Life

'కమల్ హాసన్ వల్ల ఆర్ధికంగా ఇబ్బంది పడ్డాను' - ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్! - KAMAL HASSAN

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.