Independence Day Movie Releases: టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలతో ఈ వారం థియేటర్లు కళకళలాడనున్నాయి. అందులో ముఖ్యంగా అందరి దృష్టి మాస్ మహారాజ రవితేజ మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, కోలీవుడ్ స్టార్ విక్రమ్ తంగలాన్ సినిమాలపై ఉండనుంది. ఈ సినిమాలతోపాటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ సిద్ధమయ్యాయి. మరి అవెంటో చూద్దాం.
మిస్టర్ బచ్చన్
రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సె నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ కానున్నాయి. అంతకంటే ముందే ఆగస్టు 14న ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
డబుల్ ఇస్మార్ట్
ఉస్తాద్ రామ్- పూరి జగన్నాథ్ కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కింది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై చార్మి నిర్మించారు. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. రామ్ డైలాగ్స్, తెలంగాణ యసతో సినిమాపై అంచనాలున్నాయి. కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 15నే విడుదల కానుంది.
తంగలాన్
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా 'తంగలాన్' సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు.
ఖేల్ ఖేల్ మే
ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన 'పర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్' ఇప్పుడు హిందీలో 'ఖేల్ ఖేల్ మే' అలరించడానికి సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, తాప్సి, అమ్మీ వ్రిక్, వాణీకపూర్, ఫర్దీన్‌ఖాన్, ఆదిత్య సీల్, ప్రజ్ఞా జైశ్వాల్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
ఈటీవీ విన్
- వీరాంజనేయులు విహారయాత్ర (తెలుగు)- ఆగస్టు 14
నెట్‌ఫ్లిక్స్
- డాటర్స్ (వెబ్‌సిరీస్)- ఆగస్టు 14
- వరస్ట్ ఎక్స్ ఎవర్ (వెబ్‌సిరీస్)- ఆగస్టు 14
- ఎమిలీ ఇన్ పారిస్ (వెబ్‌సిరీస్)- ఆగస్టు 14
- ది యూనియన్ (హాలీవుడ్)- ఆగస్టు 16
- లవ్ నెక్ట్స్ డోర్ (కొరియన్)- ఆగస్టు 17
డిస్నీ+హాట్‌స్టార్
- డార్లింగ్ (తెలుగు)- ఆగస్టు 13
- ది టైరాంట్ (కొరియన్)- ఆగస్టు 14
సోనీలివ్
- చమక్ (హిందీ సిరీస్)- ఆగస్టు 16
జీ5 (ZEE 5)
- మనోరథంగల్ (యాంథాలజీ ఫిల్మ్)- ఆగస్టు 15
OTTలో ఒకరోజు ముందుగానే సినీ జాతర! - ఈ 3 మాత్రం డోంట్ మిస్! - August 1 OTT Releases